Moviesనాని సమర్పించిన " అ! " మూవీ రివ్యూ రేటింగ్

నాని సమర్పించిన ” అ! ” మూవీ రివ్యూ రేటింగ్

హీరోగా సూపర్ సక్సెస్ లు అందుకుంటున్న నాని.. నిర్మాతగా చేసిన మొదటి ప్రయత్నం అ!. ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కాజల్, రెజినా, ఈషా రెబ్బ, నిత్యా మీనన్ కలిసి నటించారు. అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి, మురళి శర్మలు నటించారు. కొత్త ప్రయత్నం డిఫరెంట్ మూవీ అని చెబుతున్న ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్షలో చూద్దాం.

కథ :

కథగా చెప్పేందుకు ఇందులో ఒక కథ. కాదు ప్రపంచంలో నేను.. నాలోనే ప్రపంచం అంటూ పోస్టర్ లో దర్శకుడు చెప్పిన పాయింటే ఈ సినిమా కథ. ఈ కథలో ప్రతి పాత్ర జీవితం కోసం పోరాడుతుంది. వారి వారి సమస్యల నుండి, కోరికల నుండి అధిగమించాలని చూస్తుంది. ముఖ్యంగా లీడ్ క్యారక్టర్స్ అంతా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు.. వారు ఎదుర్కున్న సమస్యలు ఏంటన్నదే అ! సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

సినిమా మొత్తం ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నా ఎవరికి వారు తమ రోల్ లో పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. అందరికి అ! ఓ కొత్త ప్రయత్నమే. ఇదవరకు ఇమేజ్ కు కాస్త భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. కాజల్, రెజినా, నిత్యాల పర్ఫార్మెన్స్ అందరికి నచ్చుతుంది. ఇక ఈషా, అవసరాల, ప్రియదర్శి ఇలా చేసిన అందరు బాగా చేశారు. నాని, రవితేజల వాయిస్ ఓవర్ కూడా సినిమాకు ప్లస్ అవుతుంది.

సాంకేతికవర్గం పనితీరు :

సినిమాటోగ్రఫీ బాగుంది.. ఇలాంటి సినిమాలకు అది చాలా ఇంపార్టెంట్. ఇక మ్యూజిక్ పర్వాలేదు. ఇంకాస్త నోటబుల్ గా ఉంటే బాగుండేది. ఎడిటింగ్ పర్ఫెక్ట్. డైరక్షన్ బాగుంది. దర్శకుడు అన్నివిధాలుగా కొత్త ఫ్లేవర్ కోసం ట్రై చేశాడు. నాని నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ :

ఏదో ఒక సినిమా నిర్మించేద్దాం.. డబ్బులు సంపాదించేద్దాం అన్న ఆలోచనతో కాకుండా.. అభిరుచి గల నిర్మాతగా నాని అ! తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా అంతా ముందునుండి చెబుతున్నట్టుగానే కొత్త ప్రయోగంగా సాగుతుంది. ఇది ఓ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా తెలుగు సినిమాను కొత్త పంథాలో తీసుకెళ్లే సినిమాగా చెప్పొచ్చు.

రొటీన్ మాస్ మసాలా, లవ్ స్టోరీలకు భిన్నంగా జీవితం గురించి తెలియచెప్పే ప్రయత్నమని అ! సినిమాను చెప్పొచ్చు. సినిమాలో ప్రతి సందర్భంలో దర్శకుడి రివీల్ చేసే పాయింట్స్ ఆడియెన్స్ కు సర్ ప్రైజ్ అయ్యేలా చేశాయి. సినిమాకు కావాల్సిన మూడ్ అంతటిని ముందే సెట్ చేసి టైటిల్స్ దగ్గర నుండి ఎండ్ కార్డ్ వరకు ఎంగేజ్ అయ్యేలా చేశారు.

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా ఇది ఓ అద్భుతమైన ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. అందుకే నాని ఈ సినిమా కోసం ఇంతగా చెప్పుకొచ్చాడు. సినిమా చూశాక మనకు అదే ఫీలింగ్ రాక మానదు. తప్పకుండా తెలుగులో ఇలాంటి సినిమాలు రావాలని ఆశిద్దాం.

ప్లస్ పాయింట్స్ :

కథ

కథనం

డైరక్షన్

సినిమాటోగ్రఫీ

లీడ్ క్యాస్టింగ్

రవితేజ , నాని ల వాయిస్ ఓవర్


మైనస్ పాయింట్స్ :

మిస్సింగ్ రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్

బాటం లైన్ :

నిజంగానే నాని అ! అనేలా చేశాడు..!

రేటింగ్ : 3.5/5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news