టాలీవుడ్‌లో ఒకేసారి రెండు మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండడం ఇటీవల పెద్ద ప్రాబ్లమ్‌గా మారిపోయింది. ఒకేసారి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే థియేటర్ల సమస్య ఏర్పుడుతోంది. ఒకేసారి తమ సినిమాను ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసి భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టాలని ప్లాన్ చేస్తోన్న నిర్మాతలకు ఈ సమస్య ఇబ్బందిగానే ఉంటోంది. అయితే పండగల టైంలో ఒకేసారి రెండు మూడు సినిమాలు వచ్చినా ఇబ్బంది ఉండడం లేదు… మిగిలిన టైంలో ఈ సమస్య తీవ్రంగానే ఉంటోంది.
గత యేడాది ఆగస్టు 11న ఒకే రోజు జయ జానకి నాయక, లై, నేనే రాజు నేనే మంత్రి సినిమాలు వచ్చాయి. మూడు సినిమాలకు సరైన థియేటర్లు లేక వీటికి టాక్ బాగున్నా అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాలేదు. ఇక ఇప్పుడు ఈ యేడాది ఏప్రిల్ 27 కూడా అదే సమస్య తలెత్తనుంది. ఈ యేడాది ఏప్రిల్ 27న ముందుగా బన్నీ నా పేరు సూర్య డేట్ ఫిక్స్ చేశారు.
ఆ తర్వాత ఆ డేట్ తెలియకుండానే మహేష్ – కొరటాల శివ కాంబోలో వస్తోన్న భరత్ అను నేను రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ రెండు సినిమాల నిర్మాతల్లో ఎవ్వరూ తప్పుకునే పరిస్థితి లేదు. ఎవరికి వారు ఏప్రిల్ 27నే వస్తామని పట్టుబట్టుకుని కూర్చున్నారు. వీరి గొడవ ఇలా ఉంటే సూపర్‌స్టార్ రజనీకాంత్ 2.0 సినిమా ముందుగా ఏప్రిల్ 27నే రిలీజ్ చేయాలనుకున్నారు.
అయితే ఆ సినిమా వాయిదా పడడంతో రజనీ అనూహ్యంగా అదే డేట్‌కు తన మరో కొత్త సినిమా కాలాను లైన్ లో పెట్టేసి 27 విడుదల అంటూ రిలీజ్ పోస్టర్స్ కూడా వదిలారు. కబాలి డిజాస్టర్ తర్వాత దర్శకుడు రంజిత్ పాకు ఏరికోరి మరీ ఛాన్స్ ఇచ్చాడు రజని. రజనీ డాన్ పాత్ర పోషిస్తుండడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. రజనీ సినిమా వస్తుందంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో చెప్పక్కర్లేదు.
దీంతో ఏప్రిల్ 27న ఇప్పుడు సూర్య వర్సెస్ మహేష్ వర్సెస్ రజనీకాంత్ మధ్య బాక్సాఫీస్ వార్ ఎలా ఉంటుందో ? ఎవ్వరూ అంచనా వేయలేకపోతున్నారు. ఇక ఈ సినిమాల్లో బన్నీ సినిమా తన డేట్ మార్చుకోవాలని అనుకుంటే ఏప్రిల్ 13 ఒక్కటే ఆప్షన్‌గా ఉంది. మార్చి 30న రంగస్థలం వస్తోంది. దీంతో రెండు వారాలు గ్యాప్ ఉండాలంటే ఏప్రిల్ 13 డేట్ ఒక్కటే బన్నీకి సరైన డేట్ కానుంది. అయితే అదే రోజు నాని కృష్ణార్జున యుద్ధం కూడా సిద్ధంగా ఉంటుంది. ఏదేమైనా అందరికంటే ముందుగా బన్నీ ఏప్రిల్ 27 డేట్ బుక్ చేసుకుంటే ఆ తర్వాత రేసులోకి మహేష్, రజనీ వచ్చేయడంతో బన్నీకి ఇప్పుడు ఏం చేయాలో ? తెలియడం లేదు.