ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే రాంగోపాల్ వర్మ కొద్దీ రోజులుగా సైలెంట్ అయిపోయాడు. ఇలా అయితే తన గొప్పతనం ఏముంటుంది అనుకున్నాడో ఏమో కానీ మళ్ళీ తన రూట్ లోకి వచ్చేసి వివాదాస్పద కామెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. కామ్ గా తన పని తాను చేసుకుపోతే అతను వర్మ ఎందుకు అవుతాడు.
పవన్ కళ్యాణ్ హీరో గా వస్తున్న ‘అఙ్ఞాతవాసి’ సినిమాకి సంబంధించి పోస్టర్‌లు విడుదల కాగా.. దానిపై స్పందించిన వర్మ అతడిపై తన ప్రేమను కురిపించేసాడు. అది ఎంతగా అంటే అందరూ ఆశ్చర్యపోయేలా. అంతే కాకుండా ఇంకా పవన్ చాలా వ్యాఖ్యలే చేసాడు. “నేనే గత జన్మలో కూడా ఇలాంటి ఆట్యిట్యూడ్ ఉన్న అతన్ని చూడలేదు. రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ పవన్ ముందు ఎందుకు పనికిరారు, బ్రూస్‌లీకి మొగుడులా ఉన్నాడు” అంటూ పవన్ పోస్టర్‌పై కామెంట్లు చేశాడు.
అంతే కాదు మరో అడుగు ముందుకు వేసి “నేను ‘గే’ కాదని అందరికీ తెలుసు. కానీ ప్రపంచంలో ఉన్న మొత్తం అందమైన అమ్మాయిలు అందరూ ఒకవైపు ఉన్నా, నేను ఈ పోస్టర్‌లో ఉన్న అబ్బాయిని చూసే చేసుకుంటా”.. పవన్ కల్యాణ్ ముందు పుట్టాడా? ఎమోషన్ తరువాత పుట్టిందా? అనేది చెట్టు ముందా విత్తు విందా? కోడి ముందా గుడ్డు ముందా? అనే అనాది ప్రశ్నకి నా సమాధానం పవన్ కళ్యాణ్ ముందు పుట్టి మనందరకి ఇప్పుడు ఎమోషన్ నేర్పుతున్నాడని చెప్తా.. హ్యాట్సాఫ్ పీకే” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. తాజాగా వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది.