సంక్రాంతి అనగానే సినిమాల సందడి అని తెలిసిందే. అయితే ఈసారి సంక్రాంతి కానుకగా వచ్చిన స్టార్ సినిమాలు అంతగా ఆదరణ పొందలేదు. పవన్ అజ్ఞాతవాసి డిజాస్టర్ టాక్ రాగా.. బాలయ్య జై సిం హా ఓకే అనిపించినా అది కేవలం ఫ్యాన్స్ కు మాత్రమే అని తెలుస్తుంది. ఇక సూర్య గ్యాంగ్ పర్వాలేదు అనిపించినా ఎక్కువ అరవ వాసన ఉండటంతో అంతగా ఆకట్టుకోలేదు.
ఈ గ్యాప్ లో చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం దక్కించుకుందామని చూశారు రాజ్ తరుణ్ అండ్ టీం. రంగులరాట్నం సినిమాతో ప్రేక్షకుల ముందికు వచ్చిన రాజ్ తరుణ్ నాలుగు రోజుల్లో కేవలం 4 కోట్ల కలక్షన్స్ మాత్రమే సాధించాడు. పెద్ద సినిమాలు ఫ్లాప్ అయినా సరే ఆ అవకాశాన్ని వాడుకోలేకపోయింది రంగులరాట్నం సినిమా.
అయితే సినిమా టాక్ బాగున్నా సినిమా ప్రమోషన్స్ సరిగా లేకపోవడంతో అంతగా కలక్షన్స్ రాబట్టలేకపోతుంది. శ్రీ రంజని డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా నాగార్జున నిర్మాణంలో రాగా.. చిత్రా శుక్లా హీరోయిన్ గా నటించింది.
రంగులరాట్నం 4 రోజుల కలక్షన్స్ లెక్కలు ఎలా ఉన్నాయో చూస్తే..
నైజాం : 0.82 కోట్లు
సీడెడ్ : 0.58 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.59 కోట్లు
గుంటూరు : 0.34 కోట్లు
తూర్పు గోదావరి : 0.55 కోట్లు
పశ్చిమ గోదావరి : 0.38 కోట్లు
కృష్ణా : 0.20 కోట్లు
నెల్లూరు : 0.14 కోట్లు
టోటల్ ఏపి అండ్ తెలగాణా : 3.50 కోట్లు
కర్ణాటక : 0.40 కోట్లు
రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్ : 0.19 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ కలక్షన్స్ : 4.09 కోట్లు
http://www.telugulives.com/telugu/sankranthi-winner-of-four-movies/