Gossipsప్లాప్ డైరెక్టర్ కి ఆఫర్ ఇచ్చిన చరణ్

ప్లాప్ డైరెక్టర్ కి ఆఫర్ ఇచ్చిన చరణ్

చిరు తనయుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాం చరణ్ మొదటి సినిమా పూరి జగన్నాధ్ డైరక్షన్ లో చేసిన సంగతి తెలిసిందే. చిరుతగా మెగా పవర్ చూపించిన చరణ్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత చరణ్ రేంజ్ ఏంటి అన్నది తెలిసిందే. ఇక ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో రంగథలం సినిమా చేస్తున్న చరణ్ మళ్లీ మొదటి సినిమా డైరక్టర్ కు ఛాన్స్ ఇస్తున్నాడని టాక్.

టెంపర్ తర్వాత వరుస ఫ్లాపులను తీస్తున్న పూరి ఈమధ్యనే చరణ్ కు ఓ కథ వినిపించాడట. ప్రస్తుతం తనయుడు ఆకాష్ హీరోగా మెహబూబా సినిమా చేస్తున్న పూరి ఆ సినిమా తర్వాత చరణ్ తో సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నాడట. అయితే పూరి చెప్పిన కథ రొటీన్ గా అనిపించడంతో సారీ అని చెప్పాడట. అయితే వేరే రచయిత కథతో అయినా సరే పూరికి ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట చరణ్.

కెరియర్ మంచి ఫాంలో ఉన్న ఈ టైంలో చరణ్ పూరికి హామీ ఇవ్వడం పెద్ద రిస్కే అని అంటున్నారు. అయితే ఎంతైనా హీరోగా తొలి హిట్ ఇచ్చిన డైరక్టర్ కాబట్టి పూరి మీద చరణ్ కు ఆ కృతజ్ఞత ఉంది. మరి ఈ కలయిక ఎప్పుడు ఎలాంటి సినిమాతో వస్తుందో చూడాలి.

Latest news