Gossipsమీడియా మిత్రులారా.. అది నా దురద్రుష్టం.. ప్రదీప్ వీడియో మెసేజ్..!

మీడియా మిత్రులారా.. అది నా దురద్రుష్టం.. ప్రదీప్ వీడియో మెసేజ్..!

మొత్తానికి నాలుగు రోజుల నిరీక్షణకు ఈరోజు ముగింపు పడింది. డిసెంబర్ 31 రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడిన ప్రదీప్ ఆరోజు నుండి బయటకు రాలేదు. కౌన్సెలింగ్ కు కూడా అటెండ్ కాకపోవడంతో రకరకాల వార్తలు రాశారు. ఫైనల్ గా ప్రదీప్ ఓ వీడియో మెసేజ్ తో అందరిముందుకు వచ్చాడు. 31 రాత్రి ఏం జరిగిందో అందరికి తెలిసిందే. లా ప్రకారం ప్రొసీడింగ్స్ అన్ని ఫాలో అవుతా అంటూ ప్రదీప్ చెప్పాడు.
ఇక లాస్ట్ ఇయర్ తానే డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దని చెప్పానని.. దురదృష్టవశాత్తు వాటిని తానే ఉల్లంఘించానని.. మీడియా మిత్రులకు, ప్రేక్షకులు తాను కనబడకుండా పోయానని అనుకుంటున్నారు. కేవలం తను ఇచ్చిన కమిట్మెంట్ వల్ల కుదరలేదు కాని అన్ని ప్రొసీడింగ్స్ లా ప్రకారం నడుచుకుంటా అని అన్నారు ప్రదీప్. మొత్తానికి తాను ఇంకా లేటు చేస్తే ఘోరాలు జరిగిపోతాయని ఊహించినట్టు ఉన్నాడు. అందుకే వీడియో మెసేజ్ తో మ్యానేజ్ చేశాడు.https://www.youtube.com/watch?v=ZVtZUylxfXI&t=1s

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news