Gossipsపవన్ గురించి పీకే స్పందన లేదేంటో..!

పవన్ గురించి పీకే స్పందన లేదేంటో..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కేవలం ప్రేక్షకులే అభిమానులు కాదు.. సినిమా వాళ్లు కూడా అభిమానులే.. కత్తి దాడికి స్పందిస్తూ పవన్ కు సపోర్ట్ గా కోనా వెంకట్, పూనం కౌర్ లాంటి వారు ట్వీట్స్ వేసిన సంగతి తెలిసిందే. అఫ్కోర్స్ ఆ విషయంలో పూనం కౌర్ గురించి మహేష్ కత్తి చేసిన హంగామా అంతా ప్రజలకు తెలిసిందే. అయితే ఎలాగోలా కత్తి వర్సెస్ పవన్ ఫ్యాన్స్ గొడవ ముగిసింది.

దీనిపై పూనం కౌర్ కూడా స్పందించింది.. ప‌విత్రంగా ఉండాల‌నే ఆలోచ‌న ఒక శ‌క్తి… అది దైవశ‌క్తి కంటే గొప్పది… తెలుసు కోవాల్సింది ఇంకేమైనా ఉందా? ఇంకెవ‌రైనా వ‌స్తారా అని ట్వీటు చేసి పీకే ల‌వ్ అని హ్యాష్ టాగ్ పెట్టింది. ఇదంతా బాగానే ఉంది కాని పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర చేస్తుంటే అభిమాని అయిన పూనం కౌర్ ఎందుకు నోరు విప్పలేదు అంటూ కామెంట్లు వస్తున్నాయి.

ఆల్రెడీ ఒకసారి ట్వీట్ చేస్తేనే నానా రచ్చ జరిగింది కదా అని సైలెంట్ అయ్యిందో ఏమో కాని అనవసర విషయాల పట్ల పవన్ కు సపోర్ట్ గా నిలబడం కన్నా అవసరమైన విషయాల్లో స్పందించడం మంచిందని కొందరు చెబుతున్నారు. మొత్తానికి పవన్ పొలిటికల్ టూర్ పై పూనం స్పందన వచ్చే దాకా ఈ వార్తలు కొనసాగేలా ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news