సింహ, శ్రీరామ రాజ్యం సినిమాలతో బ్లాక్ బస్టర్ లు కొట్టిన బాలయ్య – నాయన తార జంట జై సింహ సినిమాతో మళ్ళీ తెరమీద మెరుస్తున్నారు. నందమూరి బాలకృష్ణ – నయనతార ల మధ్యన ఎన్నో సంవత్సరాల నుంచీ తెరమీద మంచి అనుబంధం ఉంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ లలో భాగంగా నయనతార ఇంటర్వ్యూ లు కూడా ఇస్తున్నారు.
శ్రీరామ రాజ్యం లాంటి సినిమాలో రాముడు గా చేసిన బాలయ్య కంటే సీతగా చేసిన నయనతార కే ఎక్కువ పేరు కొట్టేసింది. అసలు వీళ్ళ ఇద్దరి కాంబినేషన్ అంటేనే హిట్ గ్యారంటీ అనే టాక్ ఇండ్రస్ట్రీలో బలంగా ఉంది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూ లో బాలయ్య పై షాకింగ్ కామెంట్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. అదేంటంటే… నేను బాలయ్యను తండ్రిలా చూస్తానని చెప్పింది. ఆయనను చూస్తే గౌరవంతో రెండు చేతులు జోడించి, దణ్ణం పెట్టాలనిపిస్తుందని తెలిపింది.
. బాలయ్యతో కలసి నటించడమంటే తనకు ఎప్పుడూ ఇష్టమేనని చెప్పింది. బాలకృష్ణ తనకు ఎప్పుడూ సొంత కుటుంబ సభ్యుడిగానే కనిపిస్తారని తెలిపింది. ఆమె మాటలు ఇప్పుడు నందమూరి ఫాన్స్ మాత్రం కోపంతో ఊగిపోతున్నారు. ఒక పక్క బాలయ్య పక్కన హీరోయిన్ గా చేస్తూ ఇలా మాట్లాడ్డం ఎంతవరకు కరెక్ట్ అంటూ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.