ఎవడి సత్తా వాడికే వుంది.. అది నాది కాదు : తారక్

రచయితగా సక్సెస్ అయిన వక్కంతం వంశీ డైరక్షన్ చేస్తే మొదటి సినిమా ఎన్.టి.ఆర్ తోనే అని రెండు మూడేళ్లు వెయిట్ చేశాడు. అయితే ఎంతకీ వారి మధ్య చర్చలు సఫలం కాకపోవడంతో ఎన్.టి.ఆర్ ను వదిలి బన్నితో సినిమా షురూ చేశాడు వంశీ. నా పేరు సూర్య టీజర్ చూశాక ఇదే కథను ఎన్.టి.ఆర్ వద్దన్నాడని.. వక్కంతం వంశీ టేకింగ్ కూడా బాగుంది కాబట్టి అనవసరంగా ఎన్.టి.ఆర్ ఈ సినిమా మిస్ చేసుకున్నాడని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు.

కాని ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ కథ ఎన్.టి.ఆర్ కోసం రాసింది కాదట. ఎన్.టి.ఆర్ కోసం రాసిన కథ అలానే ఉందని.. అది రికార్డులు తిరగరాసే కథని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ కథనే బన్ని కోసం కొంత మార్చి రాశాడన్న వార్తలకు వక్కంతం వంశీ టీం నుండి రెస్పాన్స్ వచ్చింది. ఇది బన్ని కోసం రాసిన కథ మాత్రమే అని.. ఎన్.టి.ఆర్ కోసం యాక్షన్ కథ సిద్ధంగా ఉందని.. దానిలో కొన్ని మార్పులు చేసి ఎన్.టి.ఆర్ కు వంశీ వినిపించాలనుకుంటున్నాడని తెలుస్తుంది.

మొత్తానికి నా పేరు సూర్యతో సత్తా చాటాలనుకున్న వక్కంతం వంశీ టీజర్ తో శభాష్ అనిపించుకోగా.. సినిమా హిట్ కొడితే మాత్రం కచ్చితంగా తారక్ అవకాశాన్ని కూడా అందుకుంటాడని చెప్పొచ్చు.

Leave a comment