లాస్ట్ ఇయర్ అర్జున్ రెడ్డి సినిమాతో చిన్న సినిమాగా వచ్చిన సంచలన విజయం అందుకున్న డైరక్టర్ సందీప్ వంగ తన రెండవ సినిమా చిన్న సినిమానే చేస్తున్నాడు. అయితే మూడవ సినిమా మాత్రం ఏకంగా సూపర్ స్టార్ మహేష్ తో తీయాలని చూస్తున్నాడట. ఇప్పటికే ఓ లైన్ మహేష్ కు వినిపించడం మహేష్ మెప్పు పొందడం జరిగిందట.
తెలుస్తున్న సమాచారం ప్రకారం మహేష్ కు చెప్పిన సందీప్ రెడ్డి కథకు షుగర్ ఫ్యాక్టరీ అన్న టైటిల్ పెట్టబోతున్నారట. మహేష్ సినిమాకు కావాల్సిన కమర్షియల్ హంగులన్ని ఈ సినిమాలో ఉండేలా జాగ్రత్త పడుతున్నారట. ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో భరత్ అనే నేను సినిమా చేస్తున్న మహేష్ ఆ తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నాడు.
ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డితోనే మహేష్ సినిమా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్జున్ రెడ్డితో సత్తా చాటాడు కాబట్టి కచ్చితంగా డైరక్టర్ ను నమ్మేయొచ్చు. ఇక తీస్తున్న రెండవ సినిమా కూడా క్లిక్ అయితే ఇక సందీప్ కు తిరుగులేదని చెప్పొచ్చు.