2018 సంక్రాంతి అటు ప్రేక్షకులకు, ఇటు డిస్టిబ్యూటర్లకు నిరాశే మిగిల్చాయి. అఙ్ఞాతవాసి చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాకొట్టడంతో డిస్టిబ్యూటర్లు, సినీ అభిమానులు ఊపిరి పిల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో నందమూరి నటసింహాం బాలకృష్ణ నటించిన జైసింహా సినిమా జనవరి 12 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కలెక్షన్లు మోస్తారుగా ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
బాలకృష్ణ, దర్శకుడు కేఎస్ రవికుమార్ రూపొందించిన జై సింహా చిత్రానికి క్రిటిక్స్, ఆడియెన్స్ నుంచి పెద్దగా స్పందన వ్యక్తం కాలేదు. అమెరికాలో జై సింహ చిత్రం 84 స్క్రీన్లలో గురువారం ప్రివ్యూ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. దాంతో $122,512 డాలర్లు అంటే రూ.1.84 కోట్లు వసూలైంది అని ట్రేడ్ అనలిస్టు తరుణ్ ఆదర్శ్ వెల్లడించారు.
కాగా, జై సింహా చిత్రం శుక్ర, శనివారాల్లో అమెరికాలో ఓ మోస్తరు కలెక్షన్లు సాధించింది. శుక్రవారం జై సింహా చిత్రం రూ.72 లక్షలు , శనివారం రూ.53లక్షలు వసూలు చేసింది. మొత్తంగా అమెరికాలో ప్రివ్యూతోపాటు రెండురోజుల కలెక్షన్లు రూ.3.70 లక్షలు వసూలు చేసింది అని ట్రేడ్ అనలిస్టు రమేష్ బాలా ట్వీట్ చేశారు.
శుక్ర, శనివారాల లెక్కల ప్రకారం తెలంగాణ, ఏపీలో ఈ చిత్రం రూ.11.83 కోట్లు వసూలు చేసింది. బాలకృష్ణ సినిమా వరకు ఇవి ఓ రకంగా అత్యుత్తమమే అని చెప్పుకోవచ్చనే అభిప్రాయాన్ని ట్రేడ్ పండితులు పేర్కొంటున్నారు.
తెలంగాణ ప్రాంతంలో జై సింహా కలెక్షన్లు సానుకూలంగానే ఉన్నాయి. నైజాం ప్రాంతంలో జై సింహ రూ. 2.65 కోట్లు వసూలు చేసింది. వారాంతంలో కొంత పెరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది.
ఏపీలో జై సింహా కలెక్షన్లు ఈ విధంగా నమోదయ్యాయి. సీడెడ్‌లో రూ.2.03 కోట్లు, తూర్పు గోదావరిలో 0.92 కోట్లు, పశ్చిమ గోదావరిలో 0.88 కోట్లు, గుంటూరులో రూ.1.81 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.1.07 కోట్లువసూలు చేసింది.
ఇక అమెరికాలో అఙ్ఞాతవాసి పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. శుక్ర, శనివారాల్లో ఈ చిత్రం రూ.2.91 కోట్లు (73,263 డాలర్లు) వసూూలు చేసింది అని రమేష్ బాలా ట్వీట్‌లో పేర్కొన్నారు.
అఙ్ఞాతవాసి సినిమా ఏపీ, తెలంగాణలో గత నాలుగు రోజుల్లో ఈ విధంగా కలెక్షన్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో పవన్ చిత్రం సుమారు రూ.33.22 కోట్లు వసూలు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో 6.63 కోట్లు, సీడెడ్‌లో 3.4 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.3.58 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.3.19 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.3.98 కోట్లు, గుంటూరు రూ.4.32 కోట్లు, నెల్లూరు రూ.1.84 కోట్లు వసూలు చేసింది.
జై సింహా – అఙ్ఞాతవాసి కలెక్షన్స్.. పాపం డిస్టిబ్యూటర్లు..
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి