అక్కినేని అఖిల్ హీరోగా చేసిన రెండవ సినిమా హలో. విక్రం కుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమాను అన్నపూర్ణ బ్యానర్, మనం ఎంటర్టైనర్ మెంట్ ప్రొడక్షన్ లో కింగ్ నాగార్జున నిర్మించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా నిర్మాతపై 50 లక్షల దావా వేశాడు ఓ ఉత్తర భారతదేశానికి చెందిన వ్యక్తి. ఏంటి ఈ సినిమా కథ తను రాసుకున్న కథనా.. లేక ఈ సినిమా తన లవ్ స్టోరీకి సంబందించిందా అంటే అలాంటిదేమి కాదు కాని ఈ సినిమాలో హీరోయిన్ హీరోకి రాసి ఇచ్చిన నెంబర్ తనదని అంటున్నాడు.
డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమా పర్వాలేదు అనిపించగా.. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఆ నెంబర్ ట్రై చేయడం మొదలు పెట్టారట. కొద్దిరోజులు ఓపిక పట్టిన ఆ వ్యక్తి చివరకు తన పర్మిషన్ లేకుండా తన నెంబర్ వాడినందుకు సినిమా దర్శక నిర్మాతల మీద కేసు వేసేందుకు సిద్ధమయ్యాడట. అసలే సినిమా పోయిందని బాధపడుతున్న అఖిల్ కు ఈ ఇన్సిడెంట్ మరో తలనొప్పి తెచ్చి పెట్టిందని తెలుస్తుంది.
అఖిల్ 3వ సినిమా ఎనౌన్స్ మెంట్ చేయాల్సి ఉన్నా ఈ గొడవ వల్లే చెప్పలేదని అంటున్నారు. మరి కేసు, కోర్టు లాంటివి కాకుండా తనకి ఎంతో కొంత ఇచ్చి సర్ధి చెబితే బెటర్ అని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.