Newsవీడియోతో సహా బయట పడిన గజల్ కీచక పర్వం..

వీడియోతో సహా బయట పడిన గజల్ కీచక పర్వం..

గాయకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించిన కేశిరాజు శ్రీనివాస్ అలియాస్ గజల్ శ్రీనివాస్ మంచి ముసుగులో చేస్తున్న చీకటి అక్రమాలు బయట పడ్డాయి. ఆఫీస్ లో పనిచేస్తున్న ఓ మహిళను లొంగదీసుకునే ప్రయత్నం చేయగా ఆమె పక్కా ఆధారాలతో గజల్ శ్రీనివాస్ ను పట్టించేసింది. బాధితురాలు చెప్పిన దాని ప్రకారం ఆలాయవాణి వెబ్ రేడియో నడిపిస్తున్న గజల్ శ్రీనివాస్ అప్పుడప్పుడు జూనియర్ ఆర్టిస్టులను ఆఫీస్ కు తెచ్చుకునే వాడని అంటున్నారు.

ఆఫీస్ లో పనిచేస్తున్న వారిని కూడా అసభ్యకరంగా ప్రవర్తించేవాడని బాదితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఆఫీస్ టైంలో కూడా ఎవరెవరో వచ్చివెళ్తుంటారని.. వారు వచ్చిన టైంలో తమని ఆఫీస్ బయట ఉండమని చెప్పేవాడని బాధితురాలు చెప్పింది. మొత్తానికి సమాజంలో గౌరవ మర్యాదలున్న గజల్ శ్రీనివాస్ లోని అసలు రంగు ఇప్పుడు బయటపడింది.

ఇక ఈ విషయంపై అతని మీద విపరీతమైన నెగటివ్ కామెట్లు చేస్తున్నారు నెటిజెన్లు. గర్భిణి స్త్రీలు చూస్తే ముచ్చటేస్తుందని.. వాళ్లు మోసేది శిశువుని కాదు భావి భారతాన్ని అని చెప్పుకొచ్చాడు. అలాంటి గజల్ శ్రీనివాస్ ఇలాంటి పని చేయడం అందరికి షాక్ ఇచ్చింది.

https://www.youtube.com/watch?v=LGY94Ww1dsM

Latest news