Gossips" అజ్ఞాతవాసి " పబ్లిక్ టాక్ & రివ్యూ

” అజ్ఞాతవాసి ” పబ్లిక్ టాక్ & రివ్యూ

పవన్ కళ్యాన్ త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన సినిమా అజ్ఞాతవాసి. ఈ ఇయర్ మోస్ట్ ఎవైటెడ్ మూవీగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా లో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటించారు. మరి భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
విందా (బొమ్మన్ ఇరాని), ఇంద్రాణి (కుష్బు) భార్యా భర్తలు. ఇద్దరు కలిసి ఏబి ఫార్మా కంపెనీని నడుపుతుంటారు. అయితే ఆ కంపెనీలో డైరక్టర్ గా పనిచేసే దీనబందు కొడుకు సీతారాం (ఆది పినిశెట్టి) విందాతో పాటుగా అతని కొడుకుని చంపేసి తనకి అడ్డులేకుండా చేసుకుంటాడు. ఇంద్రాణి తన సోదరుడు అప్పాజి (తణికెళ్ల భరణి)ను సాయం అడుగుతుంది. ఇక తన సూచనల మేరకే బాల సుబ్రమణ్యంగా హీరో ఆ కంపెనీలో ఉద్యోగిగా చేరతాడు. విందా హత్య ఎలా చేయబడ్డాడు అన్న క్లూస్ వెతుకుతూ.. ఇంద్రాణిని కాపాడుతుంటాడు. ఇంతకీ విందా కు అభిషిక్త్ భార్గవ్ కు ఉన్న సంబంధం ఏంటి..? విందా తన వ్యాపార సామ్రాజ్య వారసుడిగా ఎవరిని ఎనౌన్స్ చేయాలనుకున్నాడు..? బాలసుబ్రమణ్యం, అభిషిక్త్ భార్గవ జీవితంలో సూర్యాకాంతం (అను ఇమ్మాన్యుయెల్), సుకుమారిల (కీర్తి సురేష్) ల పాత్ర ఏంటి అన్నది తెర మీద చూడాల్సిందే.
నటీనటుల ప్రతిభ :
పవన్ కళ్యాణ్ ఉంటే చాలు అనుకునే బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్న ఈ సమయంలో పవన్ త్రివిక్రం కాంబినేషన్ లో భారీ గా వచ్చింది అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో చేశాడు. బాలసుబ్రమణ్యం, అభిషిక్త్ భార్గవ పాత్రల్లో వేరియేషన్ ఏం లేదు. అయితే ఫ్యాన్స్ కు నచ్చే రీతిలో సినిమా నడిచింది. ఇక కీర్తి, అను ఇమ్మాన్యుయెల్ ఉన్నారంటే ఉన్నారన్నట్టు కనిపిస్తారు. సినిమాలో వారికి అంతగా ప్రాధాన్యత లేదు. ఖుష్బు పాత్ర అత్తారింటికి దారేదిలో నదియా పాత్ర అంత స్కోప్ లేదు. అయినా సరే ఉన్నంతలో బాగా చేసింది. ఆది పినిశెట్టి విలనిజం  బాగాలేదని చెప్పొచ్చు. అతనికి ఇచ్చిన బిల్డప్ కు క్లైమాక్స్ కు సంబంధం ఉండదు. రావు రమేష్, మురళి శర్మ, తణికెళ్ల భరణి పాత్రలు ఆకట్టుకుంటాయి. రఘు బాబు, వెన్నెల కిశోర్ లు అలరించారు.
సాంకేతికవర్గం పనితీరు :
మనికందన్ సినిమాటోగ్రఫీ బాగుంది.. సినిమాలో ప్రతి ఫ్రేం చాలా రిచ్ గా కనిపిస్తుంది. కోటగిరి వెంకటేశ్వర్ రావు ఎడిటింగ్ ఓకే అక్కడక్కడ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది అది ట్రిం చేస్తే బాగుండేది. ఇక సినిమాకు అనిరుద్ మ్యూజిక్ బాగానే ఇచ్చాడు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు. త్రివిక్రం కథ కథనాలు పాతవే అయినా తన మాటలతో సినిమాను లాక్కొచ్చాడు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే రిచ్ గా ఉన్నాయి.
విశ్లేషణ :
సినిమా కథ పాతదే అని చెప్పుకోవాలి. తండ్రిని చంపిన వారి మీద పగ తీర్చుకునే కథలు చాలా వచ్చాయి. కథనం విషయంలో కూడా త్రివిక్రం మార్క్ గ్రిప్పింగ్ మిస్ అయ్యిందని చెప్పాలి. ఇక సినిమాలో పవన్ రెండు పాత్రలు వేరియేషన్ ఏమి లేదు. అయితే సినిమా మాత్రం పవన్ ఫ్యాన్స్ కు నచ్చే అంశాలతో తెరకెక్కించారు.
ముఖ్యంగా త్రివిక్రం మార్క్ డైలాగ్స్ అయితే సూపర్ అని చెప్పాలి. కథ హాలీవుడ్ సినిమా లార్గో వించ్ కు దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. మొదటి భాగం మొత్తం అసలు కథలోకి తీసుకెళ్లకుండా ఏదేదో చూపిస్తారు. సెకండ్ హాఫ్ అసలు కథన్ అండిపించగా అక్కడక్కడ కొన్ని పొరపాట్లు ఉన్నాయి. మొత్తానికి పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా అజ్ఞాతవాసి ఉంది.
సినిమా అంచనాలను అందుకునే అవకాశం ఉంది. సంక్రాంతి హాలీడేస్ ఉన్నాయి కాబట్టి ఈ సినిమా బాక్సాఫీస్ మీద వీర విహారం చేయొచ్చు. అయితే కథ కథనాలు ఇంకాస్త గొప్పగా రాసుకుని ఉంటే బాగుండేదన్న అసంతృప్తి అయితే సగటు ప్రేక్షకుడికి ఉంటుంది.
ప్లస్ పాయింట్స్ :
పవన్ కళ్యాణ్
సినిమాటోగ్రఫీ
ఇంటర్వల్
ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్ :
స్టోరీ
నరేషన్
హీరోయిన్స్
బాటం లైన్ :
పవన్ త్రివిక్రం అజ్ఞాతవాసి.. ఇద్దరి మార్క్ కనిపించింది..!
రేటింగ్ : 2.5/5
మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news