Gossipsకొత్త చిక్కుల్లో అజ్ఞాతవాసి.. అతనితో డీల్ కుదరట్లేదట..!

కొత్త చిక్కుల్లో అజ్ఞాతవాసి.. అతనితో డీల్ కుదరట్లేదట..!

పవన్, త్రివిక్రం కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా ఓ పక్క ఫ్లాప్ అయినందుకు బాధపడుతుంటే.. మూలిగే నక్క మీద గుమ్మడికా పడ్డట్టు హాలీవుడ్ డైరక్టర్ జెరోం అజ్ఞాతవాసి మీద పరువు నష్టం దావా వేయాలని చూస్తున్నాడు. దాదాపు అతను 100 కోట్ల దాకా చిత్ర దర్శక నిర్మాతల మీద దావా వేస్తాడని టాక్. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందే కాపీ వివాదం రాగా లార్గో వించ్ సినిమాను కొన్న టీ సీరీస్ తో డీల్ సెట్ చేసుకున్నారని అన్నారు.

టీ సీరీస్ తో డీల్ కుదుర్చుకున్నాక లార్గో వించ్ డైరక్టర్ జెరోం ఎందుకు అంత ఫీల్ అవుతున్నాడు అంటే. అజ్ఞాతవాసి ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవడమే తన కోపానికి కారణమన్నట్టు తెలుస్తుంది. అసలు టీ సీరీస్ తో అయినా అజ్ఞాతవాసి టీం మాట్లాడిందా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. పవన్ త్రివిక్రం సినిమా కలక్షన్స్ హంగామా చేయాలి కాని ఇలా వివాదాల హడావిడి చేస్తుందని ఎవరు ఊహించి ఉండరు. మరి ఈ గొడవకు ఎప్పుడు ఎక్కడ ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి.

http://www.telugulives.com/telugu/multistarer-movie-details/

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news