Gossips2017వ సంవత్సరంలో టాప్ 10 హిట్స్ అండ్ ఫ్లాప్స్ .. ఇవే..!

2017వ సంవత్సరంలో టాప్ 10 హిట్స్ అండ్ ఫ్లాప్స్ .. ఇవే..!

ఏడాది పూర్తయింది వందల కొద్ది సినిమాలు వచ్చాయి. ఇంతకీ వాటిలో ప్రేక్షకుడు మెచ్చిన సినిమాలు ఎన్ని.. 2017లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమాల లెక్క ఎన్నున్నా టాప్ ప్లేస్ లో నిలిచిన ఓ పది మాత్రం అద్భుతాలు సృష్టించాయి. ఈ ఇయర్ కూడా కంటెంట్ ఉన్న సినిమానే విజయం సాధించింది. బడ్జెట్ తో సంబంధం లేని సినిమాలు బాక్సాఫీస్ పై ప్రభావం చూపించాయి. ఓవరాల్ గా టాలీవుడ్ టాప్ 10 ఇన్ 2017 ఏంటి అంటే..

బాహుబలి కన్ క్లూజన్ : 2017లో టాప్ వన్ గా నిలిచిన సినిమా బాహుబలి-2 కన్ క్లూజన్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఇది బిగింగ్ రేంజ్ ఏమాత్రం తగ్గకుండా వసూళ్లు సాధించింది. ఇంకా చెప్పాలంటే పార్ట్ 1 కన్నా కన్ క్లూజన్ ఎక్కువ వసూళ్లు సాధించిందని చెప్పొచ్చు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్రూవ్ చేశాడు. దాదాపు సినిమా వసూళ్ల పరంగా 1800 కోట్లను టచ్ చేసింది.

ఖైది నంబర్ 150 : మెగాస్టార్ రీ ఎంట్రీగా వచ్చిన ఈ ఖైది నంబర్ 150 సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ కత్తికి రీమేక్ గా వచ్చింది. పదేళ్లె తర్వాత కూడా చిరు స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసిన సినిమా ఖైది నంబర్ 150. అప్పటిదాకా ఉన్న నాన్ బాహుబలి రికార్డులన్ని మెగాస్టార్ చెరిపేసి బాక్సాఫీస్ పై తనదైన ముద్ర వేసుకున్నాడు.

అర్జున్ రెడ్డి : విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాను సందీప్ వంగ డైరెక్ట్ చేశాడు. యూత్ ఆడియెన్స్ కు బాగా ఎక్కేసిన ఈ సినిమా 4 కోట్ల బడ్జెట్ తో తీయగా 40 కోట్ల వసూళ్లలో ప్రభంజనాలు సృష్టించింది. రిలీజ్ ముందు లిప్ లాక్ వివాదం జరుగగా అది కూడా సినిమాకు కలిసి వచ్చే అంశంగా మారింది. ఓవరాల్ గా ఈ ఇయర్ టాప్ 10లో చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకున్న సినిమాగా అర్జున్ రెడ్డి అదరగొట్టింది.

ఫిదా : మెగా హీరో వరుణ్ తేజ్ కు కెరియర్ లో మొదటిసారి కమర్షియల్ హిట్ ఇచ్చిన సినిమా ఫిదా. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. భానుమతిగా అమ్మడి పర్ఫార్మెన్స్ సినిమాను హిట్ బాట పట్టించింది. ఇక ఈ సినిమా ఈ ఇయర్ టాప్ 10 సినిమాల లిస్టులో ప్లేస్ సంపాదించేసింది.

జై లవ కుశ : యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటించిన సినిమా జై లవ కుశ. బాబి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా తారక్ క్రేజ్ ను మరింత పెంచేసింది. నటనలో తన సత్తా ఏంటో రుజువు చేసుకున్న ఎన్.టి.ఆర్ కలక్షన్స్ తో దుమ్మురేపాడు. ఈ ఇయర్ టాప్ 10 సినిమాల లిస్టులో ఎన్.టి.ఆర్ కూడా స్థానం సంపాదించుకున్నాడు.

శతమానం భవతి : శర్వానంద్ హీరోగా వచ్చిన శతమానం భవతి సినిమా మంచి కుటుంబ కథా చిత్రంగా సూపర్ హిట్ అందుకుంది. ప్రాంతీయ విభాగంలో సినిమాకు నేషనల్ అవార్డ్ కూడా రావడం విశేషం. సతీష్ వేగేశ్న డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు.

నేను లోకల్ : వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని ఈ ఇయర్ మళ్లీ నేను లోకల్ తో హిట్ ఫాం మొదలు పెట్టాడు. నక్కిన త్రినాధరావు డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నాని కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

నిన్ను కోరి : నాని, నివేథా థామస్ లీడ్ రోల్స్ లో నటించిన నిన్ను కోరి ఓ ఫెయిల్యూర్ లవ్ స్టోరీతో వచ్చింది. నాని మార్క్ నటనతో సినిమా ఆకట్టుకోగా నివేథా, ఆది పినిశెట్టు కూడా బాగా చేశారు. శివ నిర్వాణ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఫైనల్ గా హిట్ సాధించింది.

గౌతమిపుత్ర శాతకర్ణి : బాలయ్య వందవ సినిమాగా వచ్చిన సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. క్రిష్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాలయ్యకు స్పెషల్ మూవీగా నిలిచింది. తక్కువ బడ్జెట్ తో తక్కువ రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసిన ఈ సినిమా నిర్మాతకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. బాలయ్య నటన సినిమాకు హైలెట్ అయ్యింది.

ఘాజి : భళ్లాలదేవగా అదరగొట్టిన రానా.. ఘాజిగా ఓ సబ్ మెరైన్ కాన్సెప్ట్ తో వచ్చి అలరించాడు. సంకల్ప్ రెడ్డి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఓ హాలీవుడ్ మార్క్ టేకింగ్ అనిపించింది. ఈ ఇయర్ హిట్ సినిమాల్లో ఘాజి ప్లేస్ సంపాదించింది.

ఇక ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోళ్తా కొట్టాయి. టాలీవుడ్ 2017 రివ్యూలో ఫ్లాపుల లెక్క ఎలా ఉందో చూద్దాం..

మహేష్, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన స్పైడర్ రికార్డులు బద్ధలే అన్న ఊపు తీసుకురాగా సినిమా రిలీజ్ తర్వాత మాత్రం మహేష్ కెరియర్ లో బ్రహ్మోత్సవం తర్వాత స్పైడర్ చేరేలా అపజయపాలైంది. కథ కథనాలు ఏవి తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేదు. అయితే స్పైడర్ తమిళంలో మాత్రం సోసోగా ఆడింది. ఇక నాగార్జున ఎన్నో ఆశలతో చేసిన ఆధ్యాత్మిక సినిమా ఓం నమో వెంకటేశాయ. రాఘవేంద్ర రావు డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా కూడా నాగార్జునకు ఫ్లాప్ వచ్చేలా చేసింది. ఇక భారీ అంచనాలతో వచ్చిన పవన్ కళ్యాణ్ కాటమరాయుడు కూడా పవన్ కెరియర్ లో భారీ డిజాస్టర్ గా మిగిలింది. కిశోర్ కుమార్ పార్ధసాని డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా పవన్ ఫ్యాన్స్ ను నిరాశపరచింది.

ఇక వరుణ్ తేజ్ శ్రీను వైట్ల కాంబోలో వచ్చిన మిస్టర్ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. సందీప్ కిష్ హీరోగా కృష్ణవంశీ డైరక్షన్ లో వచ్చిన నక్షత్రం సినిమా కూడా ఫెయిల్యూర్ అటెంప్ట్ గా మిగిలింది. బాలకృష్ణ పూరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ బాగున్నా సినిమా ఆ రేంజ్ అందుకోలేకపోయింది. ఈ ఇయర్ గోపిచంద్ కు ఏమాత్రం కలిసి రాలేదు. సంపత్ నంది డైరక్షన్ లో వచ్చిన గౌతం నంద సినిమా ఈ ఇయర్ ఫ్లాపుల లిస్టులో చేరింది. నాగ చైతన్య హీరోగా నూతన దర్శకుడు డైరక్షన్ లో వచ్చిన సినిమా యుద్ధం శరణం. ఇది కూడా అంచనాలను అందుకోలేదు. సునీల్ కూడా ఉంగరాల రాంబాబు అంటూ ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. ఆ తర్వాత 2 కంట్రీస్ సినిమాది అదే పరిస్థితి అయ్యింది. మంచు మనోజ్ ఒక్కడు మిగిలాడు సినిమా మంచి హైప్ తో రాగా అయినా ఆ అంచనాలను అందుకోలేదు.

ఎలాగు పాత సంవత్సరం గడించింది. రానున్న 2018 లో అయినా లాస్ట్ ఇయర్ ఓటమిని అంగీకరిస్తూ సూప్రర్ హిట్ సినిమాతో రావాలని చూస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news