రచయిత యండమూరి వీరేంద్రనాథ్ – మెగా ఫ్యామిలీ వివాదం గురించి తెలిసిందే. స్టార్ హీరో రామ్ చరణ్ గురించి యండమూరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్‌కి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి. దీనిపై మెగా హీరోలంతా సీరియస్‌గానే స్పందించారు. మెగా బ్రదర్ నాగబాబు `ఖైదీనంబర్ 150` ప్రీ రిలీజ్ వేడుకలో యండమూరిపై రెచ్చిపోయారు. ఓ చానెల్ ఇంటర్వ్యూలో మెగాస్టార్ సైతం యండమూరి సంస్కారాన్ని ప్రశ్నించారు. ఆ వివాదం అక్కడితో అయిపోయినట్టు లేదు. యండమూరి వీలున్న ప్రతి వేదికపైనా కక్ష తీర్చుకుంటున్నారన్నఆధారంతో ఓ వీడియో సామాజిక మాధ్యమంలోకి వచ్చి చేరింది.
యండమూరి ఆ వివాదంపై తనదైన శైలిలో స్పందించారు. అసలు ఆ వీడియో ప్రసంగం ఐదు సంవత్సరాల క్రితం చిత్రీకరించిందని, కొంత కాలం క్రితం అది వెలుగులోకి రావడంతో ఈ వివాదం చెలరేగిందని చెప్పారు. అసలు ఆ వీడియోలో తాను చెప్పిన విషయం ఒకటైతే ప్రచారంలోకి ఇంకొకటి వచ్చిందన్నారు. ఇద్దరు కుర్రవాళ్లు ఎలా పైకొచ్చారని చెప్పడమే తన ఉద్దేశమని చెప్పారు. హిందూపురంలో జరిగిన ఆ కార్యక్రమంలో గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలు ఎక్కువగా ఉండడంతో సినిమా హీరోల పేర్లయితే వారు బాగా అర్ధం చేసుకుంటారని ఆ పేర్లను ఎంచుకున్నానని చెప్పారు. గంట పాటు పవన్ కల్యాణ్ ను పొగిడానని – పవన్ అంటే గాలిని పీల్చి బ్రతికేవాడని, అంజనీ పుత్రుడని , ఆంజనేయుడని చెప్పానని అన్నారు.
హీరో, హీరోయిన్ ల ముఖాన్ని గురించి తాను కామెంట్ చేయడం తప్పని తాను ఎప్పుడు అనుకోలేదన్నారు. తన వ్యాఖ్యలను పాజిటివ్ గా కూడా తీసుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. ఒక పొట్టివాడు హీరో అయ్యాడని అనచ్చు…అని అన్నారు. అయితే ఆ రోజు అక్కడున్న పిల్లలు రాయలసీమలోని వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చినవారని వారి గురించి ఆలోచిస్తూ పరధ్యానంలో ఉన్నానని యండమూరి చెప్తున్నారు. తన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు సీరియస్ అవ్వడంపై యండమూరి స్పందించారు.
నాగబాబు ఏదో ఆవేశంలో అని ఉంటాడని ఆ విషయాన్ని అంతటితో వదిలేద్దామని తాను ప్రయత్నించానని అన్నారు. హీరో హీరోయిన్ ల ముఖాన్ని గురించి కామెంట్ చేయడం తప్పని తాను ఎప్పుడు అనుకోలేదన్నారు. తన వ్యాఖ్యలను పాజిటివ్ గా కూడా తీసుకోవచ్చు కదా అని యండమూరి ఎదురు ప్రశ్నించారు.