గ్యాంగ్ స్టార్ గా మారాలనుకొంటున్న విజయ్..

పెళ్లిచూపులు సినిమాతో హిట్ అందుకుని అర్జున్ రెడ్డిగా అదరగొట్టిన విజయ్ దేవరకొండ యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం పరశురాం డైరక్షన్ లో గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్న విజయ్ దేవరకొండ గ్యాంగ్ స్టర్ రోల్ చేయాలని ఉందని తన మనసులోని మాటని బయట పెట్టాడు. రీసెంట్ గా కన్నడలో గణేష్, రష్మి మందాన లీడ్ రోల్స్ లో నటించిన సినిమా చమక్ ఆడియో వేడుకకు అతిధిగా వెళ్లిన విజయ్ కన్నడ పరిశ్రమ మీద ప్రశంసల వర్షం కురిపించాడు.

కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ముఫ్తీ ట్రైలర్ చూసి తను కూడా అలాంటి గ్యాంగ్ స్టర్ రోల్ చేయాలని ఉందని అంటున్నాడు విజయ్ దేవరకొండ. పరశురాం డైరక్షన్ లో చేస్తున్న సినిమాలో రశ్మిక హీరోయిన్ గా నటిస్తుంది అందుకే కన్నడ చమక్ ఆడియోకి విజయ్ గెస్ట్ గా వెళ్లాడు. మరి గ్యాంగ్ స్టర్ గా విజయ్ కోరికను ఏ దర్శకుడు తీరుస్తాడో చూడాలి.

ప్రస్తుతం కుర్రాడి చేతిలో అరడజను సినిమాల దాకా ఉన్నాయి. సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న విజయ్ త్వరలోనే స్టార్ క్రేజ్ దక్కించుకుంటాడని చెప్పేయొచ్చు.

Leave a comment