చిన్న హీరో స్థాయిలో ఉన్న అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరంకొండ అమాంతం తన క్రేజ్ పెంచేసుకుని యూత్ ఎట్రాక్ట్ హీరోగా మారిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమాలో ఇతగాడి యాక్షన్ చూసి అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తరువాత ఆ సినిమా ఇండ్రస్ట్రీని షేక్ చేసింది. ఇక ఆ సినిమా వచ్చినప్పటి నుంచి యూత్ అంతా ఆయన ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పుడు ఈ అర్జున్ రెడ్డి హీరోకి పెద్ద బ్యానర్లోనే అవకాశాలు వస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో ఏ యంగ్ హీరోకి రాని, లేని ఫాలోయింగ్ విజయ్ దేవరకొండకి వచ్చేసింది. ఇక ‘అర్జున్ రెడ్డి’ లో విజయ్ నటనకు యూత్ అంతా ఫిదా అయ్యారు. అప్పటినుండి విజయ్ దేవరకొండ సినిమాలకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. విజయ్ నుంచి తరువాత ఎటువంటి సినిమా వస్తుందా అని యువత అంతా ఆసక్తిగాఎదురుచూపులు చూస్తున్నారంటే ఆయనకి ఎంత క్రేజ్ పెరిగిందో అర్ధంచ్చేసుకోవచ్చు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ ఎలాంటి పాత్ర అయితే చేసాడో.. అదే కేరెక్టర్ తో బయట కూడా తన యాటిట్యూడ్ చూపిస్తూ అందరికి షాక్ ఇచ్చేస్తున్నాడు.
రకరకాల ఫోటో షూట్స్ తో కొత్త ఫీట్స్ చేస్తూ.. అదరగొట్టేస్తున్నాడు. సరికొత్త పంచె కట్టుతో ఇప్పటివరకు హల్ చల్ చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఒక మ్యాగజైన్ కి అదిరిపోయే స్టిల్ ఒకటి ఇచ్చాడు. ఆ స్టిల్ చూస్తే.. వావ్ అనాల్సిందే. ఇంతకీ విషయం ఏంటంటే ‘వావ్’ అనే మ్యాగజైన్ కోసం విజయ్ చేసిన ఫొటో షూట్ నిజంగానే ‘వావ్’ అనిపించేలా సరికొత్తగా ఉంది.
ఆ ఫొటోలో…. ఇద్దరమ్మాయిలు పైన కూర్చుంటే.. కింద ఆ అమ్మాయిల వాళ్ల కాళ్లను పట్టుకుని సీరియస్ గా కూర్చున్న విజయ్ లుక్ వుంది. అలాగే బ్యాక్ పోజు ఇస్తూ ఆ ఇద్దరమ్మాయిలతో ఉన్న మరో ఫొటో కూడా వెరైటీగా ఉంది. మరి అర్జున్ రెడ్డి విజయ్ డిఫరెంట్ అనడానికి ఈ ఫొటో షూట్ నిదర్శనంగా నిలుస్తోంది. ఇంకెన్ని లుక్స్ తో మతులు పోగొడతాడో ఈ అర్జునరెడ్డి హీరో.