తెలుగు సినిమా ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎందుకంటే..? ఈ మధ్య స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్లు అంతా వెబ్ సిరీస్ మీద దృష్టిపెట్టారు. తాజాగా వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ కడప ‘పేరుతో ఓ వివాస్పద వెబ్ సీరిస్ ప్రారంభించాడు. ఇది ఇప్పుడు ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. కాసేపు వర్మ విషయం పక్కన పెట్టేస్తే… ఇప్పుడు వెబ్ సిరీస్ లోకి ఫ్యామిలీ హీరో విక్టోరి వెంకటేష్ దిగాడు.
ఎప్పుడూ ప్రయోగాల కథలను ఎంపిక చేసుకుని ఎప్పటికప్పుడు సరికొత్తగా కనిపించే విక్టరీ వెంకటేష్ కూడా ఇప్పుడు వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. గత కొంతకాలంగా సక్సెస్ లకు దూరంగా ఉంటున్నాడు వెంకీ. మొన్నామధ్య గురు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా వెంకీకి ఏ మాత్రం ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా వెంకీ మాత్రం ఇంకా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు.
వెంకటేష్ ఇప్పటికే ఒక వెబ్ సిరీస్ లో నటించడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో స్పెషల్ ఏమిటంటే.. రానా కూడా బాబాయ్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడట. మొన్నటి వరకు ఇద్దరూ కలిసి సినిమాలను చేస్తున్నారు అనే పుకార్లు వచ్చాయి. కానీ చివరిగా వెబ్ సిరీస్ ద్వారానే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారట. వెబ్ సిరీస్ కథ రాజీవ్ గాంధీ జీవిత ఆధారంగా ఉండబోతోందని సమాచారం. మల్టిపుల్ లాంగ్వేజ్ లలో ఆ వెబ్ సిరీస్ ఉండబోతోందట.
ఏఎమ్ ఆర్.రమేష్ దర్శకత్వంలో రాబోతోన్న ఆ వెబ్ సిరీస్ త్వరలోనే స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అయితే గతంలో రానా కూడా వెబ్ సిరీస్ మీద ద్రుష్టి పెట్టాడు. అయితే అది సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు వెంకీ కూడా అదే బాటలో నడవాలనుకుంటున్నాడు. అందుకే రానాతో కలిసి ఒక మంచి ప్రయోగం చేయడానికి డిసైడ్ అవుతున్నాడాట. త్వరలోనే బాబాయ్ – అబ్బాయ్ వెబ్ సిరీస్ లో నటించే అవకాశం ఉందన్నమాట.