కాజల్ అగర్వాల్ ఇటీవలే ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాలో తన అందం, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా టాలీవుడ్ ని ఏలుతున్న ఈ అమ్మడు వరుస ఆఫర్లతో ఇండ్రస్ట్రీని ఏలుతోంది. కుర్ర హీరోలు, పెద్ద హీరోలు అని తేడా లేకుండా అందరి పక్కన నటిస్తూ తన టాలెంట్ నిరోపించుకుంటోంది.
ఈ అమ్మడు ఒకే కుటుంబానికి చెందిన రెండు తరాల కథానాయకులతో హీరోయిన్గా నటించే అవకాశం మెగా ఫ్యామిలీలో యువ కథానాయకుడు రామ్‌చరణ్‌తో ‘మగధీర’, ‘నాయక్’, ‘ఎవడు’, ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రాల్లో నాయికగా నటించిన కాజల్ చెర్రీ బాబాయ్ పవన్ కల్యాణ్‌తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చేసింది. అలాగే చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ‘ఖైదీ నెం.150’లో నటించింది. తాజాగా ‘నేనే రాజు నేనే మంత్రి’లో రానాకి జోడీగా నటించిన ఈ ముద్దుగుమ్మ రానా బాబాయ్ వెంకటేష్‌తోనూ నటించే అవకాశం కొట్టేసింది.
ఈ స్పీడ్ కు బ్రేక్ వేస్తూ కాజల్ కు వెంకటేష్ బ్రేక్ వేశాడు. తేజా డైరెక్షన్ లో వెంకటేష్ నటిస్తున్న సినిమాలో కాజల్ ను ఎంపిక చేసారు. ఈ నేపధ్యంలో వెంకటేష్ కాజల్ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు రానా కాజల్ తో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో నటించిన నేపధ్యంలో మళ్ళీ కాజల్ తో నేను నటిస్తే ఏమి బాగుంటుంది అని వెంకటష్ చేప్పడంతో పాటు మరో హీరోయిన్ ను చూడమని తేజాకి పురమాయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే డిసెంబర్ 13న ప్రారంభం కావలసిన వెంకీ-తేజ సినిమా ఓపెనింగ్ వాయిదా పడినట్లు