Gossipsఓవర్సీస్ లో సునామి సృష్టించిన టైగర్ కలెక్షన్స్

ఓవర్సీస్ లో సునామి సృష్టించిన టైగర్ కలెక్షన్స్

ఈ ఏడాది బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కొంచెం డౌన్ అయ్యింది అనుకున్నారు. గోల్ మాల్ ఎగైన్ తప్పా ఏ సినిమా అంతగా భారీ విజయాన్ని అందుకోలేదు. ఇక సల్మాన్ షారుక్ కూడా వారి సినిమాలతో ఏ ప్రభావం చూపలేదు. అయితే సల్మాన్ ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టాలని చాలా స్పీడ్ గా టైగర్ జిందా హై షూటింగ్ ని పూర్తి చేసి క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేశాడు. ఫైనల్ గా అత్యధిక థియేటర్స్ లో సినిమా రిలీజ్ అయ్యింది.

అయితే సినిమా ఎక్కడా కూడా కలెక్షన్స్ ని ఏ మాత్రం తగ్గించడం లేదు. మొదటి నాలుగు రోజుల్లోనే 200+ కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఇక ఓవర్సీస్ కి కూడా సల్మాన్ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. విడుదలకు ముందు నుంచే విదేశాల్లో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగాయి. అయితే రీసెంట్ గా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఎనలిస్ట్ తరన్ ఆదర్శ్ చెప్పిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకూ 8.55 మిలియన్ డాలర్లను రాబట్టింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.54.79కోట్లు.

యూఏఈ-జీసీసీ: 3.375 మిలియన్ డాలర్లు

యూఎస్ ఏ-కెనడా: 2.572 మిలియన్ డాలర్లు

యూకే: 781000 డాలర్లు

ఆర్వోడబ్ల్యూ: 1.822 మిలియన్ డాలర్లు

ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. బాలీవుడ్ లో ఆ సినిమాకు ప్రస్తుతం ఏ సినిమా పోటీ లేకపోవడం ప్లస్ పాయింట్. సల్మాన్ యాక్షన్ సీన్స్ అలాగే కత్రినా కైఫ్ అందాలు రొమాంటిక్ సీన్స్ బాగా ఉపయోగపడ్డాయి. ఏక్తా టైగర్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాను అబ్భాస్ జాఫర్ తెరకెక్కించాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news