అందాల సుందరి సన్నీలియోన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఫోర్న్ స్టార్ గా టాప్ పొజీషన్ లో ఉన్న సమయంలోనే ఎరోటిక్ సినిమా జిస్మ్-2తో బాలీవుడ్ లో రంగప్రవేశం చేసింది. ఐదేళ్ల కాలంలో పదిహేను సినిమాలు పైనే చేసిన సన్నీలియోన్ కు రోజురోజుకు క్రేజ్ పెరుగుతూ వస్తోంది. కరెంట్ తీగ సినిమాతో గతంలో తెలుగు తెరపై కనిపించిన ఈ భామ ఇటీవల రాజశేఖర్ హీరోగా వచ్చిన గరుడవేగ గరుడవేగ సినిమాలోనూ తళుక్కుమంది. తాజాగా మరోసారి తెలుగు తెర మీద సందడి చేసేందుకు సిద్దమైపోతోంది.
సౌత్ ఇండియన్ కల్చర్స్ బ్యాక్ డ్రాప్ తో చారిత్రాత్మక యుద్ధ నేపథ్యంలో తెరకెక్కనున్న సినిమాలో సన్నీలియోన్ హీరోయిన్ గా నటిస్తోంది. నవదీప్, నాజర్ లు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం కత్తి సాము, గుర్రపు స్వారీతోపాటు యుద్ధ సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకోబోతోందంట ఈ ఫోర్న్ స్టార్. ముంబైలో ప్రముఖ ట్రైనర్ సన్నీలియోన్ కు శిక్షణ ఇవ్వనున్నాడట. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో బాహుబలి, 2.0 సినిమాలకు గ్రాఫిక్స్ వర్క్ చేసిన సంస్థలు ఈ చిత్రానికి పనిచేయనున్నాయి. ఈ చిత్రంలో సుమారు 70 నిమిషాలపాటు గ్రాఫిక్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు..తెలుగుతోపాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందనుంది. ఈ సినిమా టైటిల్ ను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శక నిర్మాతలు చెబుతున్నారు. వి.సి.వడివుడయన్ దర్శకత్వంలో స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టిఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటువంటి అద్భుతమైన కథ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాఇన్నాళ్లకు దొరికింది అంటూ సన్నీ ఈ చిత్రం గురించి చెప్పుకొస్తోంది. ఇప్పటివరకు నాకున్న ఇమేజ్ ను పూర్తిస్థాయిలో మార్చే సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది.ఎప్పటి నుంచో ఒక తెలుగు సినిమా చేయాలనుకొంటున్నా. దర్శకుడు వి.సి.వడివుడయన్ కథ చెప్పిన మరుక్షణం నుండే ఈ సినిమా కోసం సిద్దమైపోతున్న అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ.