సునీల్ … కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా సినిమాల్లో నవ్వుల పువ్వులు పూయించేవాడు. సునీల్ కామెడీ లేకుండా ఏ సినిమా ఉండేది కాదు. అంతగా ఆయన టాలీవుడ్ లో అవకాశాలు కొట్టేసేవాడు. ఆ తరువాత సునీల్ కి హీరో అవకాశాలు రావడంతో … కామెడీ కి పులిస్టాప్ పెట్టేసారు. కానీ ఆ తరువాత సునీల్ కి హీరో అవకాశాలు మెల్లిమెల్లిగా సన్నగిల్లడంతో మళ్ళీ సునీల్ కెరియర్ అగమ్యగోచరంగా తయారయ్యింది.
సునీల్ పరిస్థితిని చూసి కొంచెం ఆందోళన చెందుతున్న ఆయన ప్రాణ మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్ళీ ఆయన కెరియర్ ని చక్కదిద్దాలని చూస్తున్నాడు. అందుకే ఆయన కోసం కామెడీ ట్రాక్ లు సిద్ధం చేసే పనిలో పడ్డాడు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్‌తో తెరకెక్కించిన అజ్ఞాతవాసి చిత్రం ద్వారా సునీల్‌ను మరోసారి పూర్తి స్థాయి కమెడియన్ పాత్రలో చూపించాలనుకున్నాడు. సునీల్ కూడా ఒకే అనడంతో.. ఇక సినిమాలో ఆయన కనిపించడం దాదాపు ఖరారైపోయినట్టు అంతా అనుకున్నారు.
దీనిలో భాగంగానే అజ్ఞాతవాసిలోనూ నటించాలని సునీల్ భావించాడు. అందుకే త్రివిక్రమ్ తో పాటు కథ చర్చల్లో కూడా పాల్గొన్నాడు. పూర్తి స్థాయి కమెడియన్ గా సునీల్ రీఎంట్రీ ఆయన కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉండటంతో త్రివిక్రమ్ చాలా జాగ్రత్తపడ్డాడట. అందుకోసమే సునీల్ కోసం ప్రత్యేక పాత్రలు కూడా త్రివిక్రమ్ రాసుకున్నాడు. కానీ ఏమైందో ఏమో కానీ అజ్ఞాతవాసి సినిమాకి సునీల్ పాత్ర పెద్దగా హెల్ప్ అవ్వదు అనే భావానికి వచ్చిన త్రివిక్రమ్ ఆ సినిమాలో సునీల్ పాత్ర ని తప్పించాడట.
త్రివిక్రమ్ అలా చెయ్యడం వల్ల సునీల్ మొదట బాధపడ్డా … ఎప్పటికైనా త్రివిక్రమ్ తనని గాడిలో పెడతాడనే నమ్మకంతో ఉన్నాడు సునీల్.