Gossipsలిప్ లాక్ సీన్ల పై శాలినిపాండే స్పందనేంటో తెలుసా ..?

లిప్ లాక్ సీన్ల పై శాలినిపాండే స్పందనేంటో తెలుసా ..?

బేబీ.. బేబీ అంటూ ముద్దు ముద్దుగా మురిపించిన షాలినీ పాండే… ఇప్పుడు తమిళ్ లోనూ బిజీ బిజీ గా మారిపోతుంది. విడుద‌ల‌కి ముందు అనేక వివాదాలు ఈ చిత్రాన్ని చుట్టు ముట్టి, చివ‌రికి మంచి విజ‌యం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాలో షాలిని పాండే నటన ఇరగదీసేసింది

. ఈ సినిమాలో హీరో హీరోయిన్ ల మధ్య రొమాంటిక్ సీన్స్ అయితే హద్దులు మించిపోయాయి. హీరోయిన్ షాలినీ పాండే, అర్జున్ రెడ్డి లిప్ లాక్ సీన్లు పెద్ద సంచలనమే సృష్టించాయి. ఎట్టకేలకు ఈ సినిమాలో లిప్ కిస్ సీన్లపై స్పందించింది శాలిని. తనకు ప్రేమ అనుభవం ఇంతవరకూ తెలియదని, ‘ప్రీతి’ క్యారెక్టర్ లో భాగంగానే ‘అర్జున్ రెడ్డి’కి లిప్ కిస్ ఇచ్చానే తప్ప, అక్కడ తనకు విజయ్ దేవరకొండ కనిపించలేదని చాలా కొంటిగా సమాధానాలు చెప్పుకొచ్చింది ఈ బేబీ.

మిగతా అమ్మాయిలతో పోలిస్తే, తాను కొంచెం తేడా అని, తనను మరబొమ్మగా అబ్బాయిలు భావిస్తుంటారని చెప్పుకున్న షాలినీ, ‘అర్జున్ రెడ్డి’లో ఎంతో ప్యాషన్ తో కిస్ సీన్స్ చేశానని, స్టోరీ డిమాండ్ చేస్తే, బికినీలు ధరించేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ సమాధానాలు చెప్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news