అయ్యో ! సాయి పల్లవికి ఇంత అన్యాయమా..?

పీత కథ మీకు గుర్తే ఉంది కదా ఎవరన్నా ఎదుగుతున్నారని తెలిస్తే చాలు వాళ్ళను కిందకి లాగెయ్యాలని చూసే వారు ఎక్కువగా ఉంటారు. సినిమా ఇండ్రస్ట్రీలో ఇది మరి కాస్త ఎక్కువ. పైకి అంతా బాగానే ఉన్నట్టు కలరింగ్ ఇచ్చుకున్నా … వాస్తవంగా జరిగేది మాత్రం ఇదే. సరిగ్గా ఫిదా ప్రేమ్ సాయి పల్లవి పరిస్థితి కూడా ఇలాగే అయ్యింది.

తన ఆహాభావాలతో అందరిని ఆకట్టుకున్న సాయి పల్లవి ఒక్క సినిమాతోనే మంచి పేరు సంపాదించుకుంది.

దీంతో ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ దశలో సినీ పెద్దలు కొంతమంది ఆమెను టార్గెట్ చేసుకున్నారు. ఆమెకు సరైన అవకాశాలు రాకుండా చెయ్యాలని తెగ ట్రై చేస్తున్నారు. హీరోలు, వాళ్ల పెద్దలు అన్యాయంగా టార్గెట్ చేస్తున్నారు. సొంత టాలెంట్ తో ముందుకెళ్తున్న నేచురల్ బ్యూటీని తొక్కడానికి ఇప్పుడు నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఫిదాలో పల్లవి నటన ఆమెకు ఎనలేని పేరు, గౌరవం తెచ్చిపెట్టాయి. అంతేకాదు, నటనలో వరుణ్ తేజ్ ఆమె ముందు వీక్ అయిపోయాడు. అంతగా ఈమె ఫిదా సినిమాలో ఆమె జీవించేసింది.

అదే ఆమె పాలిట శాపంగా మారింది. ఫిదా సినిమాలో ఆమె నటనకు పేరు బాగా రావడం, హీరో ని మించి ఆమె ప్రతిభ చూపించడంతో సాయిపల్లవిని ఒక్క ఇంటర్వ్యూ ఆమెకి రాకుండా అడ్డుకున్నారు. ఇంతకీ ఎవరంటే… మెగా బ్రదర్ నాగబాబు తన కొడుకు వరుణ్ తేజ్ కి పేరు రావట్లేదనే ఉద్దేశంతో… సాయిపల్లవిని ఇంటర్వ్యూలు చేయకుండా పీఆర్వోలు, రిపోర్టర్ల ద్వారా ఛానెల్స్ ను కూడా అడ్డుకున్నట్టు బయటకి అందిన సమాచారం. అయితే ఇది ఇక్కడితో ఆగలేదు ఈమెకు మళ్లీ మరో రకమైన వేధింపులు మొదలయ్యాయి. ఎంసీఏలో నాని ప్రవర్తనతో మళ్లీ వివాదాల్లో ఇరుక్కుంది సాయిపల్లవి. షూటింగ్ లో గొడవ, ఆ తర్వాత ఆమె సీన్లు కూడా చాలా వరకూ తీసేసి ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేకుండా చేశారు.

Leave a comment