Gossipsరానా పెళ్లి పై బయటపడ్డ షాకింగ్ నిజాలు..!

రానా పెళ్లి పై బయటపడ్డ షాకింగ్ నిజాలు..!

టాలీవుడ్ లో పెళ్లికాని ప్రసాద్ ల సంఖ్య మరీ ఎక్కువైపోతోంది. బాహుబలి హీరోలు ప్రభాస్, రానా ఇద్దరు ఆ సినిమాకి రెండు కళ్ళు లా పని చేసారు. అయితే ఆ ఇద్దరూ నిత్య జీవితంలో పెళ్లికాని ముదురు బ్రమ్మచారుల్లాగే మిగిలిపోయారు. ప్రభాస్ పెళ్లి మాట ఈ మధ్య పెద్ద హడావుడి అయిన సంగతి తెలిసిందే కదా. ఇక దగ్గుపాటి వారసుడు రానా విషయానికి వస్తే… ఈ హీరో కి కూడా పెళ్లి వయసు దాటిపోతోంది. దీంతో అందరూ ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

అసలు ఇప్పటికే… రానా కంటే చిన్న వాడైన అక్కినేని నాగచైతన్య పెళ్లి చేసేసుకున్నాడు. అతడి క్లోజ్ ఫ్రెండ్ రామ్ చరణ్ ఐదేళ్ల కిందటే ఓ ఇంటివాడయ్యాడు. ఇంకా టాలీవుడ్లో రానా కంటే చిన్న వాళ్లయిన చాలా మంది హీరోలు పెళ్లిళ్లు చేసేసుకున్నారు. అయినా రానాకీ మాత్రం అవేవి పట్టినట్టు కనిపించడం లేదు. అసలు ఆ ఊసే ఎత్తట్లేదు. నటుడిగా రోజు రోజుకూ బిజీ అయిపోతూ అసలు ఇప్పుడిప్పుడే పెళ్లి ఆలోచనే లేనట్లుగా వ్యవహరిస్తున్నాడు.

ఇలా అందరూ వరుసపెట్టి రానా ని టార్గెట్ చెయ్యడంతో… ఆ సందేహాలన్నిటికి రానా సమాధానం ఇచ్చాడు.
తన పెళ్లి గురించి ఇంట్లో వాళ్లకు తాను మాట్లాడే ఛాన్సే ఇవ్వట్లేదని చెప్తూ తప్పించుకుంటున్నాడు. వారంలో మూడు నాలుగు రోజులు తాను అసలు హైదరాబాద్ లోనే ఉండనని.. వేర్వేరు భాషల్లో సినిమాలు చేస్తూ ఎక్కడెక్కికో తిరుగుతూ ఉండటం వల్ల తాను ఇంట్లో ఉండేదే తక్కువ అని చెప్పుకొస్తున్నారు.

ఇంట్లో ఉన్నపుడు కూడా చాలా బిజీగా ఉన్నట్లు కనిపించడం వల్ల.‘‘పాపం వీడు ఇంట్లో ఉండేదే కొంచెం సేపు.. వీడిని పెళ్లి పేరుతో విసిగించడం ఎందుకు’’ అనుకుని ఇంట్లో వాళ్లు తనను వదిలేస్తున్నారని.. అలా తాను సేఫ్ జోన్లో ఉంటున్నానని రానా కొంటెగా చెప్తున్నాడు. చెప్పాడు. హైదరాబాద్ లోని తన స్నేహితుల్ని కలిసినపుడు కూడా వాళ్లెవ్వరూ తన పెళ్లి ప్రస్తావన రానివ్వకుండా జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నానని రానా చెప్పాడు. ఇప్పుడిప్పుడే తనకు పెళ్లి చేసుకునే ఆలోచన మాత్రం లేదని రానా చెప్తుండడం చూస్తుంటే … రానా పెళ్లి చేసుకోవడానికి రెండు మూడు సంవత్సరాల సమయం పట్టేలా కనిపిస్తోంది. అప్పటికి ప్రభాస్ పెళ్లి కనుక అయిపోతే ఈ ముదురు బెండకాయ్ ఒంటరివాడు అయిపోతాడేమో.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news