ఆ విషయం హరీష్ శంకర్ కి చెప్పలేదు

rakul next with harish shankar

రకూల్ ప్రీత్ సింగ్ ! ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో ఈ ముద్దుగుమ్మ బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మ చలామణి అవుతోంది. ఈ అమ్మడు ఆచి తూచి సినిమాలను ఎంపిక చేసుకుని తన కెరియర్ ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది.

టాలీవుడ్‌కే పరిమితం కాకుండా దక్షిణాది, బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటోంది. ఎప్పటికప్పుడు  కథాబలం ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకొంటున్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ మల్టీ‌స్టారర్ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హారీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మల్టీ స్టార్ సినిమాకి దాగుడుమూతలు అనే టైటిల్ పెట్టారు.

దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. . ఈ చిత్రంలో నితిన్, శర్వానంద్ హీరోలుగా నటిస్తున్నారు.

ఈ యంగ్ హీరోల పక్కన నటించేందుకు ఇప్పటికే సాయి పల్లవిని ఎంపిక చేసుకోగా, మరో హీరోయిన్‌గా  రకుల్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం రకుల్‌తో డేట్లు, రెమ్యునరేషన్ తదితర విషయాలపై ఒక క్లారిటీ రాలేదని, వచ్చాక దీని మీద పూర్తిస్థాయిలో సమాచారం మీడియాకి వెల్లడించాలనే  ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.

నితిన్‌కి జోడీగా సాయి పల్లవిని అనుకుంటుండగా… శర్వానంద్‌ కి హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ చిత్రం 2018 మార్చిలో సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నారు. అయితే.. రకుల్ ప్రస్తుతం ఐ యారీ అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో హీరోగా సిద్దార్థ్ మల్హోత్రా, మనోజ్ బాజ్‌పేయ్ నటిస్తున్నాడు. దాగుడు మూతలు చిత్రంలో రకుల్ నటిస్తుందా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అయితే తన నిర్ణయాన్ని హరీష్ శంకర్‌కు చెప్పలేదట. చూడడం రకూల్ ఈ సినిమాలో నటిస్తుందో లేక దాగుడు మూతలు ఆడుతుందో చూడాలి.

Leave a comment