యుంగ్ హీరో టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ ఇంకా బ్రమ్మచారి గానే ఉన్నాడు. అందుకే ప్రభాస్ తో స్వయం వరం ప్లాన్ చేసి అయనకు 15 కోట్లు ఇస్తానంటే అయన తిరస్కరించాడట. దీంతో ప్రభాస్ స్వయం వరానికి బ్రేక్ పడింది. ఇంతకీ విషయం ఏంటంటే..? రాజుల కాలంలో స్వయంవరాన్ని తలపించేలా ప్రభాస్‌పై ఓ అడ్వర్టైజ్ మెంట్ కాన్సెప్ట్‌ను సిద్ధం చేసిందట ఓ మేట్రిమోనియల్ సంస్థ.
పెద్ద దర్బార్ హాల్.. ఆ హాలులోకి యువరాజైన ప్రభాస్.. రాయల్ లుక్‌లో హుందాగా నడుచుకుంటూ వచ్చి సింహాసనంపై కూర్చుంటాడు. చుట్టూ వందలాది సుందరాంగులు ప్రభాస్‌ను దక్కించుకునేందుకు పోటీపడుతుంటారు. ఈ సీన్‌ను మోడర్న్ టైమ్స్‌కు కట్ చేసి పాత తరం స్వయంవరంలా మీకు నచ్చిన భర్తను సులువుగా ఎంపిక చేసుకోవాలంటే మా మేట్రిమోనియల్ వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వండి అనేది ఆ యాడ్ కాన్సెప్ట్ గా ప్లాన్ చేసారట.
ఈ యాడ్ నిమిత్తం 15 కోట్లు పారితోషకం కూడా ఇచ్చేందుకు సదరు సంస్థ సిద్దపడగా దానికి ప్రభాస్ నిరాకరించాడట. దీని వాళ్ళ తన వ్యక్తిగత జీవితానికి భంగం కలుగుతుందనే ఆలోచనతో ఆ ప్రతిపాదనను తిరస్కరించాడట. భారీ పారితోషకాన్ని కూడా వద్దనుకుని ప్రభాస్ తన వ్యాల్యూ బాగా పెంచుకున్నాడని అందరూ ప్రభాస్ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.
టాలీవుడ్లోనే కాదు ఇప్పుడు బాలీవుడ్లో కూడా ఒన్ ఆఫ్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ప్రభాస్ అయితే ఆ మేట్రిమోనియల్ ప్రపోజల్‌కు ప్రభాస్‌నో చెప్పాడట. తన సింగిల్ స్టేటస్‌ను ఆ మేట్రిమోనియల్ సంస్థ క్యాష్ చేసుకోవాలనుకుంటోందని భావించి వ్యాల్యూస్, ఎతిక్స్కు ప్రాధాన్యమిచ్చి ఈ డెసిషన్ తీసుకున్నాడట యంగ్ రెబెల్ స్టార్. ఆ ఎండోర్స్మెంట్ గురించి ప్రభాస్ తీసుకున్న నిర్ణయాన్ని బాలీవుడ్ మీడియా కూడా తెగ పొగిడేస్తోందట. ప్రపోజ్ కాదన్నాడు ఓకే కానీ, బాహుబలి తర్వాత పెళ్ళి అన్న తమ హీరో పెళ్ళి పీటలెక్కేది ఎప్పుడో అని అంటున్నారు ఫ్యాన్స్. మరి ఆ శుభ గడియలు ఎప్పుడో వేచి చూద్దాం…!