‘‘నేను సహాయం చేసిన వాళ్లు.. నేను అండగా నిలబడిన వాళ్లు ఎవరూ.. నాకు కష్టాలు వచ్చినపుడు సహాయంగా నిలబడలేదు. అప్పుడు నన్ను ముందుకు నడిపిచింది మీరే.. మీ అభిమానమే’’ అంటూ పవన్ కల్యాణ్.. అజ్ఞాతవాసి ఆడియో విడుదల వేదికపై మాట్లాడ్డం ఇప్పుడు అందరిలోనూ కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. పవన్ వ్యాఖ్యలు ఇటు తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీలో కూడా ఎన్నోచర్చలు, గాసిప్స్ ఊపందుకున్నాయి. పవన్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసాడు అనే డౌట్ ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతోంది.
పవన్ సాధారణం గా ఎక్కడా పర్సనల్ విషయాల గురించి మాట్లాడడు. ఎదుటివారి కష్టాల్లో ఉన్నారు అని తెలిస్తే చాలు మూడో కంటికి తెలియకుండా వారికి సహాయం చేస్తుంటాడు. సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల కష్టాల్లో ఉండడంతో ఆమెకు పవన్ ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నాడు. గతంలో తుఫాన్ వచ్చిన సమయంలో వెంటనే స్పందించి సీఎం సహాయ నిధికి కోటి రూపాయల మొత్తాన్ని అందించాడు. అలాగ తన అన్న నాగబాబు కూడా గతం లో ఆరెంజ్ సినిమా తీసి ఆర్ధిక కష్టాల్లో మునిగిపోయి ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్లిపోవడంతో అప్పుడు కూడా పవన్ నేను ఉన్నా అంటూ నాగబాబుని ఆదుకున్నాడు. ఇదే విషయాన్ని నాగబాబు కూడా చాలా సందర్భాల్లో స్వయంగా చెప్పాడు .
అటువంటి నాగబాబు పవన్ ఫ్యాన్స్ ను గతంలో చాలా సందర్భాల్లో తప్పుబట్టాడు. పవన్ జనసేన పార్టీ పెట్టినపుడు కూడా విమర్శించాడు. ప్రజారాజ్యం పార్టీ విషయంలోనూ నాగబాబుకు, పవన్ కు విభేదాలు వచ్చాయని వార్తలు వినిపించాయి. అంతే కాదు పవన్ వ్యక్తిగత జీవితంలోనూ ఎంతోమంది తీవ్ర విమర్శలు చేసినా ఎప్పుడూ నాగబాబు స్పందించలేదు. ఆ బాధ కూడా పవన్ లో చాలా ఉందని అందుకే ఆ స్టేజ్ మీద అలా మాట్లాడాడని అంచనా వేస్తున్నారు. దీని మీద నాగబాబు ఎలా స్పందిస్తాడో