అల్లు అర్జున్ పవన్ ఇద్దరి మధ్య బంధుత్వం ఉన్నా.. ఈ మధ్య వారి మధ్య కొంచెం గ్యాప్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. కానీ వీరిద్దరి మధ్య ఎన్ని ఉన్నా సరే ఒకరిపై ఒకరు ఎటువంటి కామెంట్స్ ఓపెన్ గా చేసుకోరు. అటువంటి పరిస్థితుల్లో పవన్ అనుకోకుండా బన్నీ వ్యూహాలని పవన్ ఫాలో అవ్వడం సంచలనం గా మారింది. మలయాళ పరిశ్రమలో అల్లు అర్జున్ అంటే అభిమానించే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువే ఉంది.. ఆ క్రేజ్ వల్ల బన్నీ సినిమాలు అక్కడ మంచి మార్కెట్టే సంపాదిస్తున్నాయి.
ఈ విషయాన్నీ గ్రహించిన పవన్ అదే రూట్ లో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.. కానీ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కు అక్కడ అంతగా మార్కెట్ లేకపోయినా, అప్పట్లో వచ్చిన కాటమరాయుడు మలయాళ డబ్బింగ్ సినిమా ప్రేక్షకులకి తెగ నచ్చేసింది అంట. ఇంకేముంది పవన్ అజ్ఞాతవాసి సినిమాని కూడా మలయాళంలోకి డబ్ చేసి తెలుగు వెర్షన్ తో పాటు విడుదల చేయించాలని పవన్ చూస్తున్నాడు.
మాలీవుడ్ లో తనకు కొత్తగా ఏర్పడిన క్రేజ్ ను ఉపయోగించుకుని అజ్ఞాతవాసి సినిమాని ఆహే పేరుతొ మలయాళంలోకి డబ్ చేసి జనవరి 10 న విడుదల చేయబోతున్నారు. పవన్ యాక్షన్ సీన్స్‌ను మలయాళీ ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా ఎక్కువగా ఇష్టపడతారు అని ‘కాటమరాయుడు’ నిరూపించడంతో ‘అజ్ఞాతవాసి’ లో కూడ అలాంటి ఎపిసోడ్స్ బాగా ఉండటంతో ఈసినిమాను కేరళా అంతా ఒకేసారి విడుదలచేసే ఉద్దేశ్యంలో త్రివిక్రమ్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏమైనా బన్నీ కి వస్తున్న మార్కెట్ ను చూసే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి బన్నీని పవన్ ఫాలో అవుతున్నాడు అనడంలో సందేహమే లేదు.