తండ్రి పాత్రలో కొడుకు… బయోపిక్ స్టోరీ లో షాకింగ్ ట్విస్ట్

ఆ మధ్యకాలంలో తెగ హడావుడి చెయ్యడంతో పాటు మీడియా లో హాట్ టాపిక్ గా మారిన ఎన్టీఆర్ బయోపిక్ గుర్తింది కదా ! దీని మీద ఎంతో మంది రకరకాల టైటిల్స్ తో ఎన్టీఆర్ బయోపిక్ మొదలు పెట్టి ఎన్నో సంచలనాలు, వివాదాలు సృష్టించారు. అందులో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలయ్య కూడా ఒకరు.

బాలయ్య ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ ఈ రోజు ప్రారంభం కానుంది. తండ్రి నందమూరి తారక రామారావు పాత్రలో కనిపించాలని బాలయ్యకు ఎప్పట్నుంచో కోరిక ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ తో ఆ కల నెరవేర్చుకోవాలని ఎప్పట్నుంచో భావిస్తున్నాడు.

రామకృష్ణా స్టుడియోస్ లో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేకమైన సెట్ లో ఎన్టీఆర్ గెటప్ లో బాలయ్యపై కొన్ని షాట్స్ తీయబోతున్నారు. తేజ దర్శకత్వంలో రాబోతున్న ఈ బయోపిక్ ఇలా టీజర్ షూటింగ్ తో ప్రారంభం కాబోతోంది. టీజర్ షూటింగ్ ఈ ఒక్క రోజు మాత్రమే ఉంటుంది.

కానీ ఇందులో ఎటువంటి మాటలు ఉండవు. కేవలం బాలయ్యను ఎన్టీఆర్ లా చూపించడమే ఈ టీజర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ షూటింగ్ పూర్తయిన వెంటనే రేపట్నుంచి తన నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తాడు బాలయ్య. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా జనవరి 18న ఈ టీజర్ ను విడుదల చేయాలని సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య ఎలా కనిపిస్తోడో చూడాలి.

Leave a comment