మెగా స్టార్ చిరంజీవికి వెండితెర మీద ఎంత క్రేజ్ ఉందో… అందరికి తెలుసు. సినిమాల్లోకి రావడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో అందరికి తెలుసు. తెలుగు సినీ ఇండ్రస్ట్రీని మకుటం లేని మహరాజులా పాలించిన చిరు ఆ తరువాత తన ఫ్యామిలీ లో ఎంతో మందిని సినీ ఇండ్రస్ట్రీ కి పరిచయం చేసి ఇప్పుడు మెగా ఫామిలీ అనేది ఒక బ్రాండ్ గా తీర్చిదిద్దాడు. అటువంటి మెగా స్టార్ ని ఇష్టమొచ్చినట్టు స్టేజి మీద మాట్లాడేసాడు ఆర్ . నారాయణ మూర్తి. ప్రముఖ పాత్రికేయుడు పసుపులేటి రామారావు ‘తెర వెనక దాసరి’ పేరుతో పుస్తకరూపంలోకి తీసుకొచ్చారు. మంగళవారం పార్క్ హయత్ లో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్. నారాయణ మూర్తి ఈ వ్యాఖ్యలు చేసాడు. అసలు ఆయన ఏమన్నాడో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..
అయ్యా ! అందరికీ నమస్కారం. మా గురువుగారు ఇక్కడే ఉన్నట్లు, మా గురువుగారి సభ జరుగుతున్నట్లు ఉంది. ఈ పుస్తకం రాసిన పసుపులేటి రామారావుగారికి ధన్యవాదాలు. మా గురువుగారికి సమవుజ్జీ రాఘవేంద్రరావుగారికి నమస్కారం. టి సుబ్బిరామిరెడ్డి గారు మహానుభావుడు, శివ శంభో అన్నా, వ్యాపారం అన్నా, రాజకీయం అన్నా ఏ మన్నా ఆయనకు నమస్కారం కానీ… ఇలాంటి ఫంక్షన్ పెట్టి రండయ్యా… సరదాగా జరుపుకోండయ్యా… పార్క్ హయ్యత్తా దానమ్మ బాబా బ్రహ్మాండంగా తినండయ్యా అని ఈ ఫంక్షన్ చేస్తున్న మీకు నా దండాలయ్యా అంటూ తనదైన రీతిలో ఆర్ నారాయణ మూర్తి ప్రసంగం మొదలు పెట్టారు. మనసులో ఏదీ దాచుకోకుండా నర్మగర్భవ్యాఖ్యలు చెయ్యడం ఆర్. నారాయణ మూర్తికి అలవాటు.
“ఎన్టీఆర్ చెప్పుకోవటానికి ఎన్నో గొప్ప సినిమాలు ఉన్నాయని.. ఏఎన్నార్ కు చెప్పుకోవటానికి గొప్ప సినిమాలు చాలా ఉన్నాయి. కృష్ణకు అల్లూరి సీతారామారాజు ఉంది. అందరికి ఉన్నాయి. కానీ గ్రేట్ మెగాస్టార్ చిరంజీవికి చెప్పుకోవటానికి మాత్రం ఒక్క సినిమా కూడా లేదు. ఆయన ముసలోడు అయితే అరే.. నేనెంత గొప్ప సినిమా చేశాను అని చెప్పుకోవటానికి ఏ సినిమా లేదు. కానీ.. ఇప్పుడు మాత్రం సైరా ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా ఉంది” అంటూ సంచలన మాటలు మాట్లాడాడు.అయితే ఆర్ నారాయణ మూర్తి మాటలకు అక్కడ ఉన్న సభికులంతా నోరెళ్లబెట్టారు. కానీ చిరు మాత్రం చిన్నగా నవ్వుతూ థ్యాంక్ యూ అంటూ లైట్ తీసుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.