బాహుబలి 2 తర్వాత దర్శకధీరుడు రాజమౌళి చేస్తోన్న సినిమా ఏంటా ? అని ఎంతో ఆసక్తిగా ఇండియన్ సినిమా జనాలు వెయిట్ చేస్తోన్న వేళ అదిరిపోయే సూపర్ న్యూస్ వచ్చేసింది. దర్శకధీరుడు రాజమౌళి టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ – మెగాపవర్‌స్టార్ రాంచరణ్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ సినిమా తెరకెక్కిస్తున్నాడంటూ వచ్చిన వార్త ఈ యేడాది విన్న సంచలన వార్తల్లోనే టాప్ ప్లేస్‌లో ఉంది.
ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ సినిమా స్టోరీ ఎలా ఉంటుంది ? ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటి ? రాంచరణ్ క్యారెక్టర్ ఏంటి ? రాజమౌళి ఈ ఇద్దరు హీరోల క్యారెక్టర్లను సినిమాలో ఎలా సెట్ చేస్తారు ? ఇలా రకరకాల ప్రశ్నలు అందరి మదిని తొలచి వేస్తున్నాయి. ఇక ఈ సినిమా టైటిల్‌పై కూడా అప్పుడే రకరకాల వార్తలు బయటకు వచ్చాయి. యమధీర అని బాక్సర్ అని ప్రచారం జరిగింది.
ఇక ఈ సినిమా ఎలాంటి జానర్‌లో తెరకెక్కుతుంది అనేది ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్ ద్వారా బయటకు లీక్ అయ్యింది. సినీ వర్గాల్లో ట్రెండ్ అవుతోన్న న్యూస్ ప్రకారం ఈ సినిమా స్టోరీ భావోద్వేగాలతో కూడిన కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు యాక్షన్, ఫాంటసీ జానర్లలో సినిమాలు తీసిన రాజమౌళి తొలిసారి ఓ ఫ్యామిలీ సినిమాను ఎలా డీల్ చేస్తారా ? అన్నది ఆసక్తిగా ఉంది.
ఈ సినిమాకు కథ రాస్తోన్న స్టార్ రైటర్, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ స్టోరీ ఒక వాస్తవ కుటుంబం నుంచి స్ఫూర్తి పొంది తయారుచేసుకుంటున్నారట. ఆ కుటుంబం ఎవరిదో తెలియాలన్నా ఇంకొన్నాళ్ళు ఎదురుచూడాల్సిందే. అగ్రనిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే యేడాది వేసవికి స్టార్ట్ చేసి 2019 వేసవికి రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు.