Gossipsఛీ..ఛీ .. శింబు ఇంత దారుణం చేశాడా ..?

ఛీ..ఛీ .. శింబు ఇంత దారుణం చేశాడా ..?

తమిళంలో అత్యంత వివాదాస్పద హీరోగా పేరు తెచ్చుకున్న శింబు ఎన్ని ఆరోపణలు వచ్చినా తన పద్ధతి మాత్త్రం మార్చుకోవడంలేదు. శింబు వల్ల తాను పడ్డ కష్టాలను ఒక నిర్మాత మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పాడు. ఆ నిర్మాత చెప్పినదాన్ని బట్టి చూస్తే .. శింబు ఇంత నీచంగా ప్రవర్తిస్తాడా అంటూ స్వయంగా తమిళ సినీ వర్గాల వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

శింబు ఆ మధ్య కాలంలో ‘ఏఏఏ’ అనే చిత్రాన్ని చేశాడు. ఆ చిత్రంలో శింబు మూడు పాత్రలను చేసేందుకు కమిట్‌ అయ్యాడు. షూటింగ్‌ కోసం వంద రోజులు డేట్లు ఇచ్చి కేవలం 35 రోజులు మాత్రమే చిత్రీకరణకు హాజరు అయ్యాడట. తాను అనుకున్న లొకేషన్స్‌కు అనేక సార్లు షూటింగ్‌ను మార్చాడట. అలా చేయడం వల్ల ఈ సినిమాలో నటిస్తున్న చాలామంది కాల్షీట్లు వృధా అయ్యాయని నిర్మాత మైకేల్‌ రామప్పన్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

శింబు తాను అనుకున్న చోట మాత్రమే షూటింగ్‌ చేయాలని చెప్పేవాడని, సరైన సమయంకు షూటింగ్ కు ఎప్పుడూ హాజరు కాలేదని, ఈ సినిమాలో అయిదు పాటలు ఉంటే కేవలం ఒక్క పాటను మాత్రమే చేశాడు అంటూ శింబూ తీరును తప్పుపట్టాడు. ఈ సినిమాలో మూడు పాత్రలు ఉండగా కేవలం రెండు పాత్రల్లో నటించి మూడవ పాత్ర అవసరం లేదు అంటూ నో చెప్పాడు. అయితే తాను కాళ్ళ మీద పడి బతిమిలాడటంతో ఆయన ఇంట్లోనే మూడవ పాత్రకు సంబంధించిన కొన్ని షాట్స్‌ను చేసేందుకు శింబూ ఒప్పుకున్నాడట.

డబ్బింగ్‌ చెప్పేందుకు థియేటర్‌కు రాకుండా బాత్‌రూంలో డైలాగ్‌లు వాయిస్‌ రికార్డు ద్వారా చేసి, పంపించేవాడట. వాటిని సింక్‌ చేసేందుకు తాము చాలా కష్టపడ్డట్లుగా నిర్మాత చెప్పుకొచ్చాడు. మూడు పాత్రల కోసం మూడు రకాలుగా బరువు మారుతాను ముందుగా చెప్పిన శింబు ఒక్క పాత్ర కోసం కూడా రెడీ కాలేదు అన్నాడు. ఇక మేకప్‌ కూడా సరిగా వేయించుకునేవాడు కాదని ఇంకా అనేక సంచలన ఆరోపణలు గుప్పించాడు సదరు నిర్మాత. బాబు శింబూ నువ్వు ఇలాగే ఉంటే నీతో సినిమాలు చెయ్యడానికి ఏ నిర్మాతా ముందుకు రాడు. అంటూ తమిళ సినీ ప్రముఖులు సెటైర్లు వేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news