నేను సినీ నేపథ్యం నుంచి రాలేదు. నాకు ఎవరి సపోర్టూ లేదు. దాంతో సినీరంగుల ప్రపంచంలోకి వచ్చేందుకు చాలా కష్టాలే పడ్డాను అని ఐటెం గర్ల్ రాయ్ లక్ష్మి చెప్తోంది.
చిన్నప్పటి నుంచి నన్ను నేను తెరమీద చూసుకోవాలన్న కోరిక బలంగా ఉండడంతోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చానని ఈ అమ్మడు చెప్తోంది.
మొదటిసారిగా కోలీవుడ్‌లో అవకాశం వచ్చింది. ఆ సినిమా తరువాత సుమారు నాలుగు సంవత్సరాల పాటు మారే అవకాశము నాకు తలుపు తట్టలేదు. సరిగ్గా అప్పుడే నాకు సినీ రంగంలో ఉన్న చీకటి కోణాలు అనుభవపూర్వకంగా తెలిసాయి. లైంగిక వేధింపులు ఏ స్థాయిలో ఉంటాయనేది నాకు అప్పుడే తెలిసింది. అయినా నేనెవరికీ లొంగకూడదని నిశ్చయించుకున్నాను. ఆ పరిస్థితులతో నన్ను సర్దుకుపోవాలని చాలామంది నచ్చచెప్పారు. అయినా నేను ఎవరి మాటా వినలేదు.
అప్పుడు అలా నేను విని ఉంటే ఈ పాటికి నేను స్టార్ హీరోయిన్ అయ్యేదాన్ని. ఈ రంగంలో ఇంతకాలంనుంచి ఉన్నా ఎందుకు సక్సెస్ కాలేకపోయానో చెప్పడానికే ఈ విషయాలు చెబుతున్నాను కానీ, ఎవరినీ కించపరచడానికి కాదు అంటూ చెప్తోంది రాయ్. ఇవి కేవలం నాకు ఎదురైన అనుభవాలు మాత్రమే. ఇలాగే అందరికీ అలా జరగాలని లేదు. అంటూ వేదాంతం చెప్పుకొచ్చింది ఈ ముద్దు గుమ్మ.
పెళ్లి గురించి ప్రశ్నిస్తే ఏం చెప్తోందో తెలుసా ఈ ముద్దు గుమ్మ ..? ఇప్పటికే నేను ఐదు సార్లు ప్రేమలో విఫలమయ్యి మోసపోయా . నేను తీవ్రమైన భావోద్వేగాలకు గురైనప్పుడు నన్ను ప్రేమించిన వ్యక్తి నన్ను అర్థం చేసుకోకుండా దూరమయ్యాడు. ఇలా ఐదు సార్లు జరిగింది. కానీ వారంతా ఇప్పుడు స్నేహితులుగానే ఉన్నారు.ప్రస్తుతం నాకు ప్రేమించే తీరికా, ఓపికా కూడా లేదంటూ సమాధానం దాటవేసింది ఈ సెక్సీ బ్యూటీ.