ఒక్కొక్కసారి చాలా చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. అప్పటివరకు ఎవరికీ తెలియని వారు కూడా ఒక్కొక్కసారి సెలెబ్రెటీలు అయిపోతుంటారు. కొంతమంది కావాలని సెలెబ్రెటీ అయ్యేందుకు వివాదాల్లో దూరుతుంటారు. వీళ్ళ దగ్గరకు వివాదాలు వెళ్లవు వీళ్ళే వివాదాలను వెతుక్కుంటూ వెళ్తుంటారు. కొంతమంది అనుకోకుండా అన్న మాటలు కూడా వారిని వార్తల్లో వ్యక్తిగా మార్చేస్తాయి.
గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ పేరు చెప్తే చాలు ఒంటి కాలుపై లేస్తున్న కత్తి మహేష్ అనే క్రిటిక్స్ రైటర్ గురించి తెలుసు కదా. ఆయనకు పవన్ కు మధ్య డైరెక్ట్ గా వివాదంగానీ పరిచయం కానీ లేకపోయినా కత్తి మహేష్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ అన్నట్టు యుద్ధం జరుగుతోంది. అసలు కత్తి మహేష్ అనే పర్సన్ అంతకు ముందు ఎవరికీ తెలియదు. సినిమాలకు క్రిటిక్స్ రాసుకుంటూ సాదాసీదాగా ఉండేవాడు.
ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ గురించి కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చెయ్యడంతో … ఆ వ్యాఖ్యలపై మహేష్ కు పవన్ ఫ్యాన్స్ నుంచి సీరియస్ వార్నింగ్స్ వెళ్లాయట. దీంతో, కత్తి మహేష్ మీడియా ముందుకు వచ్చి తన ఆవేదన వెళ్లగక్కాడు. సమాజంలో పవన్ కల్యాణ్ కి మాత్రమే ప్రశ్నించే హక్కు ఉందా? అని మహేష్ ప్రశ్నించాడు. ఓ స్టార్‌గా పవన్ ను తాను గౌరవిస్తానని, ఆయన ఓ గొప్పనటుడని తాను బలవంతంగా ఒప్పేసుకోనని చెప్పి రచ్చ రచ్చ చేసేసాడు. ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత మళ్ళీ మహేష్ కత్తి పవన్ పై విమర్శల బాణాల స్పీడు పెంచేసాడు.
ఇటువంటి వివాదాస్పద పరిస్థితుల్లో ఈ వివాదం మరింత రాజేసేందుకు కత్తి మహేష్ సిద్ధం అయిపోయాడు. అనుకోకుండా వచ్చిన పాపులారిటీని బాగా ఉపయోగించుకోవాలని డిసైడ్ అయిపోయినట్టు ఉన్నాడు. అందుకే ఒక పొలిటికల్ సెటైర్ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధం అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడ పూర్తి అయింది అని సమాచారం.
ఈ వార్త బయటకు తెలియడంతో మహేష్ పై సెటైర్లు మొదలయిపోయాయి.కత్తి తీయబోతున్న సినిమా నీచ రాజకీయాల పైనా ? లేదంటే పవన్ టార్గెట్ చేస్తూ మహేష్ తీయబోతున్న పొలిటికల్ సెటైర్ గా ఉంటుందా ? అంటూ ఘాటైన కామెంట్స్ పెడుతున్నారు. మరి కొందరైతే ‘పెసరట్టు’ సినిమాను తీసి ఘోరంగా ఫెయిల్ అయిన మహేష్ మరొకసారి మరో ఫెయిల్యూర్ ప్రయోగం చేయబోతున్నాడు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ కామెంట్స్ గోల కాసేపు పక్కన పెడితే ఈ మధ్య వచ్చిన పాపులారిటీ తనకు బాగానే వర్కవుట్ అయ్యి సినిమా ప్రమోషన్ కి బాగా ఉపయోగపడుతుందని కత్తి ఈ నిర్ణయం తీసుకున్నాడట.