టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చలామణి అయింది అందాల భామ కాజల్ అగర్వాల్. చక్కని అభినయంతో హోమ్లీ క్యారెక్టర్లతో అందరి ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు రాను రాను అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఈ మధ్య టాలీవుడ్ లోకి తమిళ్, మలయాళీ భామల హడావుడి ఎక్కువ అవ్వడంతో కాజల్ అవకాశాలకు గండిపడింది. అందుకే ఇలా చీరకట్టుకుని కూర్చుంటే లాభంలేదు అనుకుందో ఏమో కానీ ఇప్పుడు అందాల ప్రదర్శన మొదలుపెట్టింది. ఇలా అయినా అవకాశాలు వస్తాయని ఈ అమ్మడి ఆశ.
ఇప్పటి వరకు మనం చూసిన కాజల్ కాకుండా మరో కొత్త కాజల్ మనకు కనిపిస్తోంది. తాజాగా జీ గోల్డెన్ అవార్డ్స్ ఈవెంట్ కి హాజరయిన కాజల్ హాట్ హాట్ గా హాజరై అందరి మతులు పోగొట్టింది. ఇంతా అద్దంతరంగా ఈ అమ్మడు ఇలా అందాల ప్రదర్శన ఎందుకు చేస్తోందో అర్ధం కాక సినీ జనాలు కూడా గుసగుసలాడుకున్నారు. టాలీవుడ్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న కాజల్ చందమామ సినిమాతో తెలుగులో ఎంటర్ అయ్యి మగధీరతో మంచి పేరు సంపాదించింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం కలగలేదు. మళ్ళీ ఇప్పుడు కెరియర్ డైలమాలో పడేటప్పటికీ ఈ అమ్మడు అందాల ప్రదర్శన మొదలుపెట్టింది.
ఈ మధ్య కాలంలో కాజల్ ఏ ఫంక్షన్ కి హాజరయిన అందాల ప్రదర్శన మాత్రం కామన్ అయిపోయింది. గతంలో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు ఇలాగె ట్రై చేసింది. కానీ కొంతకాలంగా క్లీవేజ్ అందాల ప్రదర్శనకు దూరమైన ఈ చందమామ తాజాగా జరిగిన జీ గోల్డెన్ అవార్డ్స్ ఈవెంట్ లో మాత్రం మళ్లీ అదే రూట్ కి వచ్చేసింది. డిజైనర్ బ్లాక్ డ్రెస్ ధరించిన చందమామ.. డీప్ కట్ నెక్ తో మెరుపులు మెరిపించింది.
నిజానికి కాజల్ ఈ రేంజ్ లో అందాలను పంచడం చాలా అరుదు. అందులోనూ ఇలాంటి ఫంక్షన్ లో అయితే.. మరింత అలర్ట్ గా ఉంటుంది. కాజల్ ఇప్పుడు ఇంతగా అందాలను పంచేసి అగ్గి రాజేయడానికి కారణం ఏంటో మాత్రం ఎవరికీ అర్ధం కావడం లేదు.అకస్మాత్తుగా ఈ బ్యూటీ ఇలా హాట్ లుక్ లో దర్శనమివ్వడంతో మళ్లీ బాలీవుడ్ వైపు అడుగులు వేస్తుందేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.