Gossipsఎన్టీఆర్ పై కాజల్ షాకింగ్ కామెంట్స్... ఫ్యాన్స్ ఆగ్రహం

ఎన్టీఆర్ పై కాజల్ షాకింగ్ కామెంట్స్… ఫ్యాన్స్ ఆగ్రహం

జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు చెప్తేనే చాలు నందమూరి అభిమానులు వెర్రెక్కిపోతుంటారు. తాతకు తగ్గ మనవడిగా ఎన్టీఆర్ అందరి ఆదరాభిమానాలు సంపాదించుకోవడమే కాకుండా తాను కూడా నటనలో ఎప్పటికప్పుడు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. అందం, అభినయమే కాకుండా, డాన్స్ లో మంచి ప్రావీణ్యం ఉండడంతో ఆల్ రౌండర్ గా ఇండ్రస్ట్రీలో పేరు సంపాదించుకున్నాడు తారక్. సినిమాల కోసం ఎప్పటికప్పుడు తన బాడీ లాంగ్వేజ్ మార్చుకోవడం ఒక్క ఎన్టీఆర్ కి మాత్రమే చెల్లింది. అందుకే ఈ యువ హీరోతో సినిమా అంటేనే దర్శక నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తుంటారు. అటు వంటి ఈ యంగ్ తారక రాముడిని కాజల్ అగర్వాల్ విమర్శించింది. దీంతో తారక్ అభిమానులు కాజల్ పై గుర్రుగా ఉన్నారు.

తారక్.. అది తగ్గించుకుంటే మంచిది అని ఉచిత సలహా ఒకటి ఇచ్చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇంతకీ ఈ అమ్మడు ఎన్టీఆర్ ని ఏమని విమర్శించిందో తెలుసా … తెలుగు ఇండ్రస్ట్రీలో ఉన్న అందరి హీరోలతో పోల్చుకుంటే ఎన్టీఆర్ హైపర్ యాక్టివ్‌‌గా ఉంటాడని.. అది కాస్త తగ్గించుకోవాలని సూచిస్తోంది. అంటే.. అతనిలో ట్యాలెంట్ ఎక్కువగా ఉందని ఆమె అభిప్రాయపడుతోంది. ఓ టీవీ లైవ్ షో లో కాజల్ ఈవైకాయలు చేసింది. అన్ని విషయాల్లోనూ అందరికంటే ఒక అడుగు ముందుగానూ, చాలా స్పీడ్ గా ఉంటాడని, అతనిని అందుకోవడం అంత సులువు కాదని చెప్తోంది.

కాజల్ మాటలు సరిగ్గా అర్ధం చేసుకుంటే … ఆమె చెప్పేదాంట్లో కూడా నిజమే ఉన్నట్టు అర్ధం అవుతోంది. ఎన్టీఆర్ మీద ఆన్న అభిమానంతోనే ఆమె అలా వ్యాఖ్యానించింది తప్ప .. ఎన్టీఆర్ ని కించపరిచే వ్యాఖ్యలు ఎక్కడా చెయ్యలేదు. కానీ తారక్ అభిమానులు మాత్రం కాజల్ పై మండిపడుతూనే ఉన్నారు. ఎన్టీఆర్ హైపర్ యాక్టివ్ గా ఉంటే ఏ అమ్మడికి వచ్చిన ఇబ్బంది ఏంటో అంటూ విమర్శిస్తున్నారు. అవునులే తారక్ మీద అభిమానం అలాంటిది. ఎన్టీఆర్ ని చిన్న మాట అన్నా అభిమానులు మాత్రం ఊరుకోరు కదా !

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news