గాయాలతో కళ్యాణ్ రామ్…టెన్షన్ లో ఎన్టీఆర్

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ షూటింగ్‌లో గాయ‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది. గురువారం షూటింగ్‌లో క‌ళ్యాణ్ గాయ‌ప‌డినా కూడా ఈ రోజు క‌ళ్యాణ్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. క‌ళ్యాణ్‌రామ్ ప్ర‌స్తుతం ఎమ్మెల్యే సినిమాతో పాటు త‌న 15వ సినిమాలో న‌టిస్తున్నాడు. మ‌హేష్ ఎస్ కోనేరు స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో క‌ళ్యాణ్‌రామ్ స‌ర‌స‌న త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ వికారాబాద్‌లో జ‌రుగుతోంది.

షూటింగ్ జ‌రుగుతుండ‌గా క‌ళ్యాణ్ చేతికి గాయం కావ‌డంతో ఈ రోజు రెస్ట్ తీసుకుంటాడ‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే క‌ళ్యాణ్ మాత్రం ఈ రోజు మామూలుగానే షూటింగ్‌కు వ‌చ్చేశారు. ఈ విష‌యాన్ని మ‌హేష్ కోనేరు ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. నిన్న త‌గిలిన దెబ్బ గురించి పట్టించుకోకుండా షూటింగ్ కంప్లీట్ చేశారు… మళ్లీ ఇవాళ పెయిన్ కిల్లర్ వేసుకుని షూటింగ్‌కి వచ్చారు. మీ ప్రొఫెషనలిజమ్‌కి హ్యాట్సాఫ్ సార్ అని కోనేరు ట్వీట్ చేశాడు.

ఇక సినిమాలో రౌడీ గ్యాంగ్ ఛేజ్ చేసే సీన్లు తీస్తుండగా బ్రిడ్జి మీద నుంచి ఫ్లాట్ ఫారమ్ మీదకు మెట్ల మీదుగా కాస్త వేగంగా దిగాలి. కానీ అదే టైమ్ లో పై మెట్టు మీద కళ్యాణ్ రామ్ కాలు స్లిప్ కావడం తో ఆయన ఫై నుండి కిందికి పడ్డాడు. దీనివల్ల చేయి వాచింది, మణికట్టు బెణికిందని దీంతో నడవలేని స్తితిలో ఇంటికొచ్చాడట.

ఇదిలా ఉంటే క‌ళ్యాణ్‌రామ్‌కు దెబ్బ త‌గిలింద‌న్న విష‌యం తెలుసుకున్న ఎన్టీఆర్ ఆందోళ‌న‌కు గుర‌య్యి వెంట‌నే క‌ళ్యాణ్‌కు ఫోన్ చేసి ఆరా తీశాడ‌ట‌. ఇక నంద‌మూరి యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్‌రామ్ ఇద్ద‌రూ అన్న‌ద‌మ్ములే. వీరు ఒక త‌ల్లి క‌డుపున పుట్క‌పోయినా తండ్రి ఒక్క‌రే కావ‌డంతో ఎంతో అనుబంధంతో అప్యాయంగా క‌లిసి మెల‌సి ఉంటారు. క‌ళ్యాణ్‌రామ్ సోద‌రుడు నంద‌మూరి జాన‌కీరామ్ మృతి త‌ర్వాత వీరిద్ద‌రు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. తాజాగా క‌ళ్యాణ్ వ‌రుస సినిమాలు చేసి అప్పుల్లో కూరుకుపోవ‌డంతో త‌న తాజా చిత్రం జై ల‌వ‌కుశ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ మీద చేసి క‌ళ్యాణ్ అప్పుల‌న్నీ తీర్చేసిన సంగ‌తి తెలిసిందే

Leave a comment