అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ హలో శుక్రవారం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అఖిల్ – కళ్యాణి ప్రియదర్శిని జంటగా నటించిన ఈ సినిమాకు జస్ట్ ఓకే టాక్ వచ్చినా మరీ హిట్ అన్న టాక్ అయితే యునానిమస్‌గా రాలేదు. తొలి రోజు ఓవర్సీస్‌లో హలో మంచి వసూళ్లే రాబట్టినా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం కేవలం రూ 3.10 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.
రెండు రోజు ఈ సినిమా వసూళ్లు భారీగా డ్రాప్ అయ్యాయి. తొలి రోజుతో పోలిస్తే ఏకంగా 35 శాతం డ్రాప్ అయ్యి ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 1.83 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. మూడు రోజులకు చూస్తే హలోకు 5.97 కోట్లు షేర్ రాబట్టింది.
రూ. 32 కోట్ల థియేట్రికల్ రైట్స్ బిజినెస్ చేసిన ఈ సినిమా అంత షేర్ రాబట్టాలంటే ప్రస్తుతం ఉన్న వసూళ్లను బట్టి చూస్తే చాలా గగనం అనిపిస్తోంది. మరో వైపు హలోతో పోలిస్తే డల్ టాక్ వచ్చిన నాని ఎంసీకే మూడు రోజులకే రూ.11.54 కోట్ల షేర్ రాబట్టింది. దీనిని బట్టి హలో గట్టెక్కడం చాలా కష్టంగా కనిపిస్తోంది.
‘ హలో ‘ 3 డేస్ ఏపీ+తెలంగాణ షేర్ : ( రూ. కోట్లలో )
నైజాం – 2.19
సీడెడ్ – 0.97
గుంటూరు – 0.64
ఉత్తరాంధ్ర – 0.65
కృష్ణా – 0.45
వెస్ట్ – 0.36
ఈస్ట్ – 0.39
నెల్లూరు – 0.28
————————————-
ఏపీ+తెలంగాణ = 5.97 కోట్లు
————————————-