మొన్నటి వరకు వరుస ప్లాపులతో సతమతం అయిన మాస్ మహారాజ్ రవితేజ రాజా ది గ్రేట్ సినిమాతో మళ్ళీ స్పీడ్ అయ్యాడు. వరుస పెట్టి అవకాశాలు ఈ మాస్ హీరో ని వెతుక్కుంటూ వస్తున్నాయి. దీంతో సెలెక్టెడ్ గా సినిమాలు ఎంపిక చేసుకుని ప్రొసీడ్ అవుతున్నాడు. కథ , కధనం అన్ని నచ్చేతేనే ఒకే చెప్తున్నాడు. టచ్ చేసి చూడు అనే సినిమాతో ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. అంతే కాకుండా ఈ మాస్ మహారాజ్ ఇప్పుడు రీమేక్ కథల వైపు దృష్టి పెట్టాడు.
దీనిలో భాగంగానే బాలీవుడ్ లో మంచి హిట్ టాక్ తెచ్చుకున్న స్పెషల్ 26 అనే సినిమా తెలుగులో రవితేజ రీమేక్ చేద్దామని తెగ ఆరాటపడ్డాడు. ఇప్పటికే దీని గురించి కొంతమంది దర్శకులతో చర్చలు కూడా జరిపాడు. అంతా ఒకే అయ్యింది అనుకున్న సమయంలో తమిళ్ హీరో సూర్య కూడా అదే కథతో తెలుగు తమిళ్ లో వస్తున్నట్లు తెలిసింది. 2013లో అక్షయ్ కుమార్ నటించిన స్పెషల్ 26 ఆదారంగా చేసుకొనే ”గ్యాంగ్” సినిమా తెరకెక్కిందట.
మొన్నటివరకు ఈ విషయాన్ని దాచి ఉంచిన సూర్య అండ్ టీమ్.. నిన్న దర్శకుడు విఘ్నేష్ శివన్ ద్వారా బయటకి వెల్లడించాడు. అంతేకాదండోయ్ ఈ సినిమా రైట్స్ కూడా కొనుక్కున్నట్టు చెప్పడంతో రవితేజ షాక్ అయ్యాడు. సూర్య నటించిన ఈ సినిమా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. పాపం రవి తేజ ఈ సినిమా చేద్దామని ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటే సూర్య ఆ ఆశలన్నీ నిరాశ చేసేసాడు.