Gossipsఎన్టీఆర్ కి ఆపరేషన్ ..?

ఎన్టీఆర్ కి ఆపరేషన్ ..?

తారక్ కి ఆపరేషన్ అయ్యిందా ..? మొన్న ఫారిన్ ట్రిప్ అన్నిరోజులు వెయ్యడానికి కారణం అదేనా..? అంటూ సోషల్ మీడియా లో ఒకటే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ తీయబోతున్న ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ఆ ఆపరేషన్ చేయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ ను కాస్త బరువు తగ్గాలని త్రివిక్రమ్ సూచించడంతో ఆయన లైపోసక్షన్ ఆపరేషన్ చేయించుకున్నాడని , దాదాపు అయిదు కిలోల ఫ్యాట్ ను తగ్గించుకున్నాడనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

అయితే ఈ విషయాన్నీ జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు మాత్రం కొట్టిపారేస్తున్నారు. కేవలం సినిమాలో సరికొత్తగా కనిపించేందుకు మాత్రమే ఎన్టీఆర్ జిం లో కసరత్తులు చేస్తున్నాడని ఆఫరేషన్ అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని వారు కొట్టిపారేస్తున్నారు. అసలు ఏమాత్రం నిజం లేని ఇటువంటి నిరాధారమైన వార్త ఎందుకు ప్రచారం అవుతుందో తెలియడంలేదని వారు చెప్తున్నారు. గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ బయట ఎక్కడా కనిపించడం లేదు దీంతో ఎవరికీ నచ్చినట్టు వారు వార్తలు అల్లేసుకుని ఎన్టీఆర్ ఇమేజ్ పాడు చేస్తున్నారని జూనియర్ అభిమానులు, సన్నిహితులు మండిపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news