సైలిష్ లుక్స్ తో అలరించే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన డ్యాన్సులతో అందరికీ ఫేవరెట్ హీరో అయ్యాడు.
అల్లు అర్జున్’ సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నాడు. ఇతని స్టయిలిష్ లుక్స్ తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా అన్ని భాషల్లోనూ అల్లు వారబ్బాయికి మంచి క్రేజే ఉంది. ఈ యంగ్ హీరో గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.
అల్లు అర్జున్ సినిమా తెరకెక్కుబోతుంది అంటే ముందుగా అందరూ ఆలోచించేది డాన్స్ గురించే . ఈ సారీ బన్నీ డాన్స్ ఎలా ఉండబోతోందో అంటూ ఆయన అభిమానులు ఆలోచిస్తూ ఉంటారు. ఎలాంటి కొత్త స్టెప్స్ వేస్తారో అని ఊహాగానాలు వస్తుంటాయి. అందుకే బన్నీ సినిమా లో డాన్స్ మీద బాగా ఫోకస్ పెడుతుంటారు దర్శకులు. అటువంటి బన్నీ చేత కొత్త కొత్తగా స్టెప్స్ వేయించేందుకు సిద్ధమైపోయింది ఓ లేడి కోరియోగ్రఫర్.
ప్రస్తుతం అల్లు అర్జున్ వక్కంతం వంశీ దర్శకత్వం లో నా పేరు సూర్య సినిమా చేస్తున్నాడు. బన్నీ కి జోడిగా అను ఇమ్మానుల్ ఈ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను ఏప్రిల్ 27 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.
బన్నీగత సినిమాలు అన్నిటిలోనూ డాన్స్ మాస్టర్లు గా జాని, శేఖర్, ప్రేమ రక్షిత్ వంటి మాస్టర్స్ డాన్స్ కంపోజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు జాతీయ అవార్డు సాధించిన నృత్య దర్శకురాలు వైభవీ మర్చంట్ ను బన్నీకి కొరియోగ్రాఫీ అందించేందుకు స్పెషల్ గా తీసుకొచ్చారు. బాలీవుడ్ లో పేరు మోసిన అనేక చిత్రాల్లో ఈమె తన కొరియోగ్రపీ నిరూపించుకుంది. మరి బన్నీ చేత ఈ లేడి మాస్టర్ ఎటువంటి కొత్త స్టెప్పులు వేయిస్తుందో చూడాలి.