Gossipsబ్రమ్మిని తొలగించాలన్న జై సింహా.. ఎందుకో తెలుసా ?

బ్రమ్మిని తొలగించాలన్న జై సింహా.. ఎందుకో తెలుసా ?

ఏ పాత్రలోనైనా చిత్ర విచిత్ర హావభావాలత ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే సత్తా ఆయన సొంతం .. అరగుండుగా, ఖాన్‌దాదాగా, కత్తి రాందాసుగా, శంకర్‌దాదా ఆర్‌ఎంపీగా వైవిధ్య పాత్రల్లో మెప్పించిన బ్రహ్మానందం ఇప్పటివరకు వివిధ భాషల్లో 900 వందలకు పైగా సినిమాల్లో నటించి అరుదైన రికార్డును సృష్టించారు. అసలు అయన లేని తెలుగు సినిమా ఉండేదే కాదు. అంత ప్రభావం చూపించిన బ్రహ్మానందం హవా క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది. హీరోల స్థాయిలో రెమ్యూనేషన్ తీసుకుంటూ సినిమాల్లో ఒక్కొక్కసారి హీరోని కూడా డామినేట్ చేస్తూ బ్రమ్మి పాత్రలో పరకాయ ప్రవేశం చేసేవాడు.

ప్రస్తుతం అప్పుడప్పుడూ మాత్రమే సినిమాలలో కనిపిస్తూ ఉన్నా బ్రహ్మీని పట్టించుకునే ప్రేక్షకులే కరువైపోయారు. ఇఫ్పుడు వస్తున్న టాప్ హీరోల సినిమాలలో ఎక్కడా బ్రహ్మానందం కనిపించడం లేదు.
ఇలాంటి పరిస్థుతులలో బ్రహ్మానందంకు ఒక టాప్ హీరో సినిమాలో నటించే అవకాసం వచ్చింది. బాలకృష్ణ సినిమాలో కాస్త లెంగ్త్ ఎక్కువగా ఉన్న రోల్ కావడంతో ఈమూవీ పై బ్రహ్మానందం ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న బాలయ్య జై సింహా సినిమాలో బ్రహ్మానందం ఓ మంచి పాత్ర చేస్తున్నాడు.

అయితే అనుకోకుండా ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర గురించి ఓ అనూహ్య విషయం బయటకి వచ్చింది.
ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ అంత బాలేదని ఈ సీన్ ల వలన మొత్తం సినిమా స్టోరీ దెబ్బతినే అవకాశం ఉందని భావించిన చిత్ర యూనిట్ మొత్తం బ్రమ్మి సీన్లకు కొత్త పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాలు లేక సతమతం అవుతున్న బ్రమ్మి ఉన్న ఒక్క సినిమాలో కూడా కోత పడడంతో అయన పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇక బ్రమ్మి సినిమాలకి రిటర్మెంట్ ప్రకటించేస్తాడేమో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news