రాష్ట్రంలో ఎన్ని రాజకీయ సంచలనాలు, పెను మార్పులు జరిగిపోతున్నాయి. ఎవరెవరో వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. రాజకీయ సునామి సృష్టించేస్తున్నారు. అయినా ఓ రాజకీయ యువ కెరటం అదరడంలేదు … బెదరడంలేదు తన పని తాను చూసుకుంటూ … చాపకింద నీరులా తన రాజకీయ ఎత్తుగడలను అమలుచేసుకుంటున్నాడు. ఆయనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్.
ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా ఏమాత్రం అదరడంలేదు బెదరడంలేదు. తన పార్టీ ఎమ్యెల్యేలను అధికార పార్టీ లాగేసుకుంటున్నా ఓ చిరునవ్వు నవ్వుతున్నాడు … ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జనాల్లో తిరుగుతూ … అదే సమయంలో పార్టీ పటిష్టత కోసం ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుకుంటున్నాడు. జగన్ కి ఉన్న టెన్సన్స్ లో అసలు పాదయాత్ర చెయ్యడమే గొప్ప అన్నట్లు ఉంది పరిస్థితి. ఎందుకంటే… అధికార పార్టీ జగన్ పాదయాత్ర ఆపడానికి చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఎన్నో ఇప్పందులు పడుతోనే ఆ యాత్ర జగన్ కొనసాగిస్తున్నాడు.
జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్ప పాదయాత్ర ఇప్పుడు ఏపీ సర్కార్ గుండెళ్లో రైలు పరుగెత్తేలా చేస్తోంది. నవంబర్ 6వ తేదీన ప్రారంభమైన జగన్ పాదయాత్రకు ఎప్పటికప్పుడు ప్రజాదరణ పెరుగుతోంది. పాదయత్రకి భారీ స్థాయిలో జనాలు వస్తుండడంతో ఏపీ సర్కార్ ఆందోళన చెందుతోంది. ఇంటెలిజెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు జగన్ ప్రజా సంకల్ప యాత్రకు సంబంధించి నివేదికను తెప్పించుకుంటోంది. అంతే కాదు జగన్ యాత్రపై కేంద్రం కూడా డేగ కళ్ళతో నిగ వేసింది. ఎప్పటికప్పుడు యాత్రకు సంబంధించి నివేదికలు ప్రధానికి చేరిపోతున్నాయి. దీని ద్వారా ఎత్తులు పొత్తులు వెయ్యొచ్చని కేంద్రం ఆలోచన చేస్తోంది.
ఇదే విషయాన్ని బీజేపీ మీడియా ఇన్‌ఛార్జ్ సంజయ్ మాయక్ కూడా ధృవీకరించారు. ఓ ప్రముఖ మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ పాదయాత్రపై తమకు సమాచారం ఉందని ఆయన చెప్పాడు. . అలాగే, కాంగ్రెస్ మీడియా ఇన్‌ఛార్జ్ రణ్‌దీప్ కూడా జగన్ పాదయాత్రపై తమకు ఎప్పటికప్పుడు నివేదిక అందుతున్నాయని అన్నారు. దీనిబట్టి చూస్తుంటే.. జగన్ చేస్తున్న పాదయాత్రకు వస్తున్న ఆదరణను చూసి 2019 ఎన్నికల్లో రాజకీయాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకునేలా కనిపిస్తున్నాయి. అవసరమైతే వైసీపీతో బీజేపీ జతకట్టే అవకాశం కనిపిస్తోంది.