మలయాళీ కుట్టి అనుపమా పరమేశ్వరన్ ఇప్పుడు టాలీవుడ్ లో దూసుకుపోతోంది. ఈమె తెలుగులో కనిపించిన మూడు సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. నితిన్ తో అ..ఆ.. నాగ చైతన్యతో చేసిన ప్రేమమ్.. శర్వానంద్ తో నటించిన శతమానం భవతి సినిమాలు మంచి కిక్కిచ్చే హిట్ సాధించాయి. తాజాగా ఈ భామ తన వ్యక్తిగత విషయాల గురించి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలనే వెల్లడించారు. నాకు విస్కీ అంటే ఎంతో ఇష్టమని ఆమె చెప్పుకొచ్చారు. ఇంతకీ విషయం ఏంటంటే…
నేను షూటింగ్ లకు బయట ఊరు వెళ్ళినప్పుడు తనగురించి తన పెంపుడు కుక్క ‘విస్కీ’ నా గురించే ఎదురు చూస్తూ ఉంటుందని చెపుతూ తనకు తన పెంపుడు కుక్క విస్కీ పై ఉన్న అభిమానాన్ని బయటపెట్టింది. విస్కీ అంటే నాకు ప్రాణం అని, అది లేకపోతే నేను ఉండలేను అంటూ వారి మధ్య ఉన్న ఎటాచ్మెంట్ గుర్తుచేసుకుంది.
ఇదే సందర్భంలో తన ఇష్టాల గురించి చెపుతూ తాను జిమ్ కు వెళ్ళను అనీ చక్కటి పోషక ఆహారం తినడం ద్వారా తన శరీరాన్ని కంట్రోల్ లో పెట్టుకుంటున్న అంటూ తన ఆరోగ్య రహస్యాలు చెప్పింది. అలాగే తనకు సోషల్ మీడియా పై పెద్దగా ఆసక్తి లేదని అందువల్ల సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉండే పద్దతిని తాను అలవాటు చేసుకోలేదు అంటూ.. ట్విస్ట్ ఇచ్చింది.
తన బెస్ట్ ఫ్రెండ్ శర్వానంద్ గురించి మాట్లాడుతూ అతడిని తన కుటుంబ సభ్యుడులానే ఫీల్ అవుతాను అని అంటూ కళ్ళతో శర్వానంద్ ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ చాల అద్భుతం అని కితాబిస్తోంది ఈ మలయాళీ కుట్టి. ఇక నాగచైతన్య చాల ప్రొఫెషనల్ గా ఉంటాడు అంటూ మొదట్లో తన మొదటి హీరో నితిన్ తో చేయడానికి తాను చాల భయపడిన విషయాన్ని కూడా బయటపెట్టేసింది.