తన నటన, డాన్స్ తో అభిమానులను పెంచుకుంటూ.. అగ్ర కథానాయకుడిగా మారిపోయిన అల్లువారి అబ్బాయి అర్జున్ ఎప్పుడు ఇండ్రస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా … ఈ అల్లువారి అబ్బాయి త్వరలో నిర్మాతగా మారబోతున్నట్టు ఇప్పటికే ఇండ్రస్ట్రీ అంతా కోడై కూస్తోంది.
తనే నిర్మాతగా ఓ కొత్త నిర్మాణ సంస్థను స్థాపించడమే కాకుండా … నూతన దర్శకుడు అను కె.రెడ్డి డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో అను తయారు చేసుకున్న కథ బన్నికి బాగా నచ్చడంతో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఉత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఒక్క అల్లు అర్జున్ ఒక్కడే కాదు.. ఇండ్రస్ట్రీలో ఉన్న హీరోలు అంతా ఇప్పడు నిర్మాణ రంగాల్లోకి వచ్చేస్తుండడం కొత్త ట్రెండ్ అన్నట్టు కనిపిస్తోంది. ఈ పాటికే … రామ్ చరణ్ ఖైదీ నెంబర్ 150 సినిమాను నిర్మించి నిర్మాతగా సక్సెస్ అయ్యారు. నేచురల్ స్టార్ నాని కూడ ప్రొడక్షన్ హౌస్‌ని స్టార్ చేశారు. అల్లు అర్జున్ కుటుంబానికి ఇప్పటికే గీతా ఆర్ట్స్ పేరుతో ఓ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ ఉంది .. దేంతో పోటీ అర్జున్ కొత్త బ్యానర్ ఏర్పాటు చేసుకోవడంతో గీతా ఆర్ట్స్ కి ఏమాత్రం తీసిపోకుండా బన్నీ సక్సెస్ సినిమాలు నిర్మించాలని డిసైడ్ అయిపోయాడు. మంచిదే కదా !