Gossipsబాధతో తెరవెనుక ఆవేదన వ్యక్తం చేసిన అల్లరి నరేష్

బాధతో తెరవెనుక ఆవేదన వ్యక్తం చేసిన అల్లరి నరేష్

సినిమా అనే రంగుల ప్రపంచంలో అందరు స్టార్లు కాలేరు.. అవుదామని అనుకున్నా పరిస్థితులు అనుకూలించవు. అయితే తెర మీద కనిపించే స్టార్స్ కన్నా తెర వెనుక కష్టపడే వారి బాధ ఎలా ఉంటుందో తెలుసా అంటూ కాదంబరి కిరణ్ ఏర్పాటుచేసిన మనం సైతం కార్యక్రమంలో సినిమా కష్టాలు అంటే.. సినిమాలు చేసినా కష్టాలు పడే కొంతమంది వ్యక్తుల గురించి చెప్పాడు అల్లరి నరేష్.

తాను యాక్టింగ్ కోర్స్ చేసేప్పుడు 106 మంది బ్యాచ్ లో ఉన్నారు. పైన ఆరుగురు హీరోలు అయ్యారు మిగతా వారు ఏమయ్యారో అంటూ చెప్పుకొచ్చాడు అల్లరి నరేష్. ఇక సినిమాల్లోనే పాత్రలు సుఖాంతం అవుతాయి జీవితంలో కష్టాలపాలవుతున్నాయని శ్రీశ్రీ రాసిన ఓ కవిత వినిపించాడు అల్లరి నరేష్. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగసిపోతే నిబిడాశ్చర్యంతో మీరే.. నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యం మీరే అంటూ శ్రీశ్రీ కవితను చెప్పి తెర మీద కనిపించే వారి కన్నా తెర వెనుక కష్టపడే ఫైటర్స్, డ్రైవర్స్, క్రేన్ ఆపరేటర్స్, ప్రొడక్షన్ వాళ్లెవరు కనిపించరని ఉద్వేగానికి లోనయ్యాడు నరేష్.

వచ్చే సంవత్సరం నుండి తన తండ్రి జ్ఞాపకార్ధంగా పేద కళాకారులను ఆదుకుంటానని అన్నాడు నరేష్. కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మనం సైతం కార్యక్రమంలో అల్లరి నరేష్ స్పీచ్ అందరిని కదిలించి వేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news