పవన్ కళ్యాణ్- ఆలీ … అసలు పవన్ సినిమా అంటేనే అలీ ఉండి తీరాలి. అలీ లేకుండా పవన్ సినిమా ఉండదు.అయితే ఇది మొన్నటివరకు. ఇప్పుడు ఆలీ లేకుండానే పవన్ సినిమా వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆలీ పవన్ మధ్య విబేధాలు వచ్చినట్టు ఒకటే పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే అందులో వాస్తవమెంతో తెలియదు కాని అందరూ అలా అనుకోవడానికి కూడా కారణాలు చాలానే కనిపిస్తున్నాయి.
ఆలీ పవన్ కళ్యాణ్ స్నేహం ఇప్పటిది కాదు. ఇండ్రస్ట్రీకి రాకముందు నుంచి వీరి మధ్య స్నేహం కొనసాగుతోంది. ఆ స్నేహం అలా పెరగడంతో పవన్ నటించే ప్రతి సినిమాలోనూ ఎదో ఒక పాత్ర ఆలీ కి ఉండేది. సినిమాల్లోనే కాదు బయట కూడా ఆలీ పవన్ చాలా క్లోజ్ గా ఉండేవారు.
దీంతో ప్రతి సినిమాలాగే.. ఆలీ ‘అజ్ఞాతవాసి’ లో కూడ ఒక కీలక పాత్రలో కనిపిస్తాడు అని అంతా భావించారు . అయితే దీనికి భిన్నంగా అలీ ‘అజ్ఞాతవాసి’ లో నటించలేదు. దీనికితోడు అలీ ‘అజ్ఞాతవాసి’ ఆడియో ఫంక్షన్ లో కూడ ఎక్కడా కనిపించలేదు. ఈ సినిమాలో అలీ నటించకపోయినా అలీ ఈ ఫంక్షన్ కు వస్తాడు అని అంతా భావించారు. దీనితో పవన్ అలీల మధ్య స్నేహం కట్ అయ్యిందని ఒకటే వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఒక వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. అదేంటంటే… ఆలీ ఈ మధ్య రాజకీయ వ్యాఖ్యలు చేయడంతోనే పవన్ అతడిని దూరం పెట్టినట్టు తెలుస్తోంది. అసలు ఆలీ ఏమన్నాడంటే… పవన్ నాకు అవకాశం ఇస్తే ‘జనసేన’ పార్టీలో చేరి ఆ పార్టీ కోసం నేను కష్ట పడతాను అంటూ ఆమధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ కామెంట్స్ పవన్ కి నచ్చకపోవడంతోనే ఇతగాడిని పవన్ దూరం పెట్టారని టాక్.
కానీ పవన్ సన్నిహితులు చెప్పే వెర్షన్ ఒకలా ఉంది. ‘అజ్ఞాతవాసి’ షూటింగ్ డేట్స్ విషయంలో ఆలీ త్రివిక్రమ్ అడిగిన డేట్స్ ను అడ్జస్ట్ చేయలేకపోవడంతో ఆలీ కోసం రాసిన పాత్రను శ్రీనివాసరెడ్డి చేత చేయించినట్లు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా ఈ వార్తలో ఎంతో కొంత నిజమే ఉంది ఉంటుంది ఎందుకంటే రాజకీయం కదా ! స్నేహితులను విడగొట్టడం ఈ రాజకీయాలకు అలవాటే ఏమంటారు..?